E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: స్కూల్ లో ఎదురెదురుగా మిస్సమ్మ, అమర్  

Nindu Noorella Saavasam Serial Today January 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: స్కూల్ లో ఎదురెదురుగా మిస్సమ్మ, అమర్  

Nindu Noorella Saavasam Serial Today Episode:   

అమర్‌ ఆఫీసులో మిస్సమ్మ గురించి ఆలోచిస్తుంటాడు. బయట రాథోడ్‌ ఏదో చేస్తుంటే.. ఒక మిలటరీ ఆఫీసర్‌ వచ్చి సార్‌ విక్రమ్‌ సార్‌ వచ్చిన బస్‌లో ప్యాసింజర్‌ లిస్ట్‌ అమర్‌ సార్‌ అడిగారట.. ఇదిగోండి అని చెప్పి ఒక కవర్‌ ఇచ్చి వెళ్తాడు. ఆ కవర్‌ తీసుకున్న రాథోడ్‌ ఓహో సార్‌ నన్ను వద్దని చెప్పి తనే స్వయంగా మిస్సమ్మ గురించి వెతుకుతున్నాడా..? అనుకుంటూ లోపలికి వెళ్లి కవర్‌ ఇస్తాడు. అమర్‌ కవర్‌ తెరచి చూస్తుంటే.. ఏంటి సార్‌ మిస్సమ్మ గురించి వెతకొద్దని నాకు చెప్పి మీరే స్వయంగా వెతుకుతున్నారా..? అని రాథోడ్‌ అడగ్గానే.. లేదు విక్రమ్‌ చెప్పింది కరెక్టేనా కాదా అని చెక్‌ చేస్తున్నాను అంటూ లిస్ట్‌ చూసి అందులో మిస్సమ్మ పేరు లేకపోవడంతో డిస్సపాయింట్ అవుతూ లిస్ట్‌ రాథోడ్‌కు ఇస్తాడు.

రాథోడ్‌ కూడా లిస్ట్‌ చూసి సార్‌ లిస్ట్‌లో మిస్సమ్మ, బుజ్జమ్మ పేర్లు లేవేంటి..? అంటే వాళ్లు హైదరాబాద్‌ రాలేదా..? లేదా విక్రమ్‌ సార్‌ పొరబడ్డారా..? లేదా వేరే ఎవరినైనా చూసి మిస్సమ్మ అనుకున్నారా..? అంతే అయ్యుంటుంది సార్‌ లేకపోతే మిస్సమ్మ, బుజ్జమ్మ హైదరాబాద్‌ రావడం ఏంటి..? ఇంటికి రాకపోవడం ఏంటి..? విక్రమ్‌ సారు పొరబడ్డారు.. మిస్సమ్మ వాళ్లు అయితే ఇక్కడకు రాలేదు.. అంటూ రాథోడ్‌ చెప్తుంటే.. అమర్‌ కోపంగా తను వస్తే ఏంటి..? రాకపోతే ఏంటి..? అదంత మనకు అనవసరం.. అంటాడు.

దీంతో రాథోడ్‌ సార్‌ మీరు పైకి అలా అంటున్నారు కానీ.. మనసులో ఎంతలా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం అవుతుంది సార్‌. మీకు మిస్సమ్మపై ఉన్నది కోపం కాదు సార్‌ బాధ.. దయచేసి ఆ బాధను కోపంగా కన్వర్ట్‌ చేయకండి సార్‌ మిస్సమ్మ బుజ్జమ్మను తీసుకుని తప్పకుండా వస్తుంది సార్‌ అని చెప్పగానే.. అమర్‌ కోపంగానే.. నాకు ఏ బాధ లేదు రాథోడ్‌.. ఎవరు వచ్చినా రాకపోయినా నాకే ఇబ్బంది లేదు.. యు కెన్‌ గో అనగానే.. రాథోడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లి మిస్సమ్మ బుజ్జమ్మ హైదరాబాద్‌ రాలేదు సార్‌ ఒకవేళ వచ్చి ఉంటే.. వాళ్లను ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తాను అనుకుని వెళ్లిపోతాడు రాథోడ్‌.

మరోవైపు బుజ్జమ్మను కనిపెట్టడం కోసం స్కూల్‌ క వెళ్తారు మనోహరి, చంభా. అంత మంది పిల్లలో బుజ్జమ్మను ఎలా కనిపెట్టాలని మనోహరి, చంభాను అడుగుతుంది. నాకు అదే అర్థం కావడం లేదు మేడం అని చెప్తుంది చంభా. ఇంతలో అక్కడికి బుజ్జమ్మను తీసుకెళ్లడానికి రాజు వస్తాడు. మనోహరిని చూసి స్కూల్‌ లోకి వెళ్లకుండా ఆటోలోనే కూర్చుంటాడు. ఈ మనోహరి ఇక్కడికి ఎందుకు వచ్చింది. ఎవరి కోసం వచ్చింది.. అంజు పాప కోసం వచ్చిందా..? లేక ఆరు పాప కోసం వచ్చిందా అని ఆలోచిస్తూ.. చాటు నుంచి చూస్తుంటాడు. ఇంతలో పిల్లుల అందరూ దగ్గరకు రాగానే.. మనోహరి అలాగే నిలడడి ఉంటుంది. బుజ్జమ్మ దగ్గరకు వచ్చి మనోహరిని తగులగానే మనోహరికి షాక్‌ తగిలినట్టు అవుతుంది. వెంటనే మనోహరి భయంగా బుజ్జమ్మ వైపు చూసి పట్టుకోవడానిక వెళ్తుంది. అక్కడే ఆటోలో వెయిట్‌ చేస్తున్న రాజు, బుజ్జమ్మను ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోతాడు. అంతా మనోహరి గమనిస్తుంది.

తర్వాత అంజు ఇంట్లో పిల్లలకు అందరికి స్కూల్‌ జరిగిన విషయం బుజ్జమ్మ గురించి చెప్తుంది. అందరూ కలిసి బుజ్జమ్మను చూడటానికి స్కూల్‌కు వస్తాడు. అప్పుడే బుజ్జమ్మను తీసుకుని మిస్సమ్మ, రాజు స్కూల్‌ కు వస్తారు. అమర్‌ ఫ్యామిలీ మొత్తం స్కూల్‌కు రావడం చూసిన రాజు, మిస్సమ్మను ప్రిన్సిపాల్‌ రూంలోకి పంపిస్తాడు. అంజు బుజ్జమ్మను చూసి అదిగో బుజ్జమ్మ వెళ్దాం పదండి అంటుంది. అందరూ బుజ్జమ్మ దగ్గరకు వెళ్తారు. అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇక అమర్‌ను పరిచయం చేయగానే.. హాయ్‌ అండి అంటూ షేక్‌హ్యాండ్‌ ఇస్తుంది బుజ్జమ్మ. బుజ్జమ్మను టచ్ చేయగానే.. అమర్‌ ఎమోషనల్ అవుతాడు. ఇక అంజు అప్పుడప్పుడు నువ్వు మా ఇంటికి వస్తుండాలి అంటుంది. దీంతో బుజ్జమ్మ మా అమ్మను అడిగి చెప్తాను అంటుంది. రాజ్‌ షాక్‌ అవుతాడు. అమర్ వెంటనే ఇక్కడికి మీ అమ్మ వచ్చిందా..? ఎక్కడ ఉంది అని అడగ్గానే.. ప్రిన్సిపాల్‌ రూంలోకి వెళ్లింది అని చెప్తుంది బుజ్జమ్మ. దీంతో అందరూ కలిసి మిస్సమ్మ కోసం ప్రిన్సిపాల్‌ రూం వైపు వెళ్తుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Related News

రెండు కాళ్లు ఫ్రాక్చర్.. ఆసుపత్రి బెడ్‌పై నుంచి పండు మాస్టర్ షాకింగ్ కామెంట్స్!

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Podarillu Lalitha : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Gundeninda GudiGantalu Today episode: పాపం ప్రభావతి.. బాలును అరెస్ట్ చేసిన పోలీసులు.. మనోజ్ ను కొట్టిన పోలీసులు..

Podarillu Today Episode : అడ్డంగా బుక్కయిన ప్రతాప్.. మాధవ్ దెబ్బకు మైండ్ బ్లాక్.. అన్నదమ్ముల సీన్ హైలెట్..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్డిగా నమ్మిమోసపోయిన ధీరజ్.. పోలీస్ స్టేషన్ లో ధీరజ్.. నర్మదకు అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని కోసం కన్నీళ్లు పెట్టుకున్న ఆరాధ్య.. నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి కమల్ వార్నింగ్..

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Big Stories

×