E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి అనుకోని ప్రయాణాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి అనుకోని ప్రయాణాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 24వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.   చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి.  ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

వృషభం

Advertisement

కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమన  వివాదాలు సర్దుమణుగుతాయి.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. 

మిథునం

వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో  నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.  గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం

Advertisement

 ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు  కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

సింహం

 బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. 

కన్య

వృత్తి వ్యాపారాలలో నష్టాలు  భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి.  ప్రయాణాలు వాహన ఇబ్బందులుంటాయి.  బంధు మిత్రులతో వివాదాలకు  దూరంగా ఉండటం  మంచిది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు.  ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం

 దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు  అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. 

ధనుస్సు

చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది. దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.  దూర  ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా  జాగ్రత్తగా వ్యవహరించాలి.  

మకరం

 వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ  చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  

కుంభం

సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.  ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

మీనం

ముఖ్యమైన వ్యవహారాలలో  అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున  ఒడిదుడుకులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగులకు  నిరాశ తప్పదు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×