E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి వ్యాపారంలో లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 31వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు.  వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం  ఉత్సాహంగా ఉంటుంది. 

వృషభం

Advertisement

చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమున  అధికారులతో సమస్యలు కలుగుతాయి. 

మిథునం

నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆప్తుల నుండి  శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది.  వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

కర్కాటకం

Advertisement

రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ  పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం

సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా  వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

కన్య

ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ  పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన  పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి  వివాదాలు  పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు  అధిగమించి ముందుకు సాగుతారు.

వృశ్చికం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.  ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. 

ధనుస్సు

దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.  

మకరం

ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి.  నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు.  ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.  వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు.  ప్రయాణాలలో వాహన  ఇబ్బందులు ఉంటాయి.  

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన  నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు  సానుకూలమవుతాయి.

మీనం

 ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.  వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×