E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి కోర్టు కేసుల్లో విజయం – వారికి ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి కోర్టు కేసుల్లో విజయం – వారికి ఆర్థిక వ్యవహారాల్లో నష్టాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల  మాటలు వివాదాస్పదంగా మారుతాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు  మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది.

వృషభం

Advertisement

వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు.  ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం  మంచిది. 

మిథునం

వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున  హోదాలు  పెరుగుతాయి. నిరుద్యోగుల  కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి.  ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

Advertisement

వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో జాప్యం  కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.

సింహం

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి అవసరానికి  ధన సహాయం లభిస్తుంది. 

కన్య

ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబమున  అనిశ్చితి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో  ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు   వసూలు అవుతాయి.

వృశ్చికం

వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా  పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

ధనుస్సు

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగస్థులకు ఊహించని స్థాన చలనాలుంటాయి. ఇతరులతో  నిదానంగా  వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

మకరం

వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  

కుంభం

వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. స్థిరాస్తికి  సంభందిత కేసు  వివాదాలలో విజయం సాధిస్తారు.

మీనం

సన్నిహితులతో  దీర్ఘకాలిక వివాదాలను రాజీ చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×