E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు పనిచేయవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయంలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు.

వృషభం

Advertisement

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. 

మిథునం

 వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయటా కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. దీర్ఘ కాలిక ఋణాల నుండి ఊరట పొందుతారు.

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. అకారణంగా ఇతరులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

సింహం

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. 

కన్య

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమయానికి నిద్ర హారాలు ఉండవు. వ్యాపార పరంగా స్వల్ప ధన నష్ట సూచనలు ఉన్నవి. వృధా ఖర్చుల విషయంలో ఆలోచించి ముందుకు ముందుకు సాగాలి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావల్సి వస్తుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

అవసరానికి ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటాబయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కుటుంబ పెద్దల ఆలోచనలు కలసివస్తాయి.  ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. 

ధనుస్సు

వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలు కొంత మానసికంగా కలచివేస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

మకరం

కుటుంబ సభ్యులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి నిందలు పడవలసి వస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారపరంగా ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.  

కుంభం

శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. నూతన గృహ వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక సమయంలో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు.

మీనం

స్ధిరాస్తి క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది.  వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×