E-Paper
Advertisement

Telangana Assembly: ఏపీ బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

Telangana Assembly: ఏపీ బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Advertisement

Telangana Assembly:  తెలంగాణలో అసెంబ్లీలో దాదాపు  10 గంటల చర్చ తర్వాత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం

Advertisement

Advertisement

తెలంగాణ అసెంబ్లీలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కృష్ణా-గోదావరి నీటి జలాల అంశంపై దాదాపు 10 గంటలపాటు సుధీర్ఘ చర్చ జరిగింది. అయితే ఈ చర్చకు బీఆర్ఎస్ సభ్యులు దూరంగా ఉన్నారు. దీనిపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏ విధంగా చేసింది? తెలంగాణకు ఎంత అన్యాయం చేసింది? అనేదానిని క్లియర్‌గా వివరించారు.

మంత్రితోపాటు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుధీర్ఘంగా మాట్లాడాడారు. పోలవరం- బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్, పోలవరం-నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టు, లేకుంటే మరే ఇతర రూపంలో కట్టే ప్రాజెక్టులకు అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం ఆమోదం పొందింది. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఏపీ నిర్మించనున్న బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులు

అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులను ఇవ్వాలన్నది అందులో మరో పాయింట్. అందుకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు మంత్రి ఉత్తమ్‌కుమార్. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్​ ప్రాజెక్టుకు వ్యయం అమాంతంగా పెరిగిపోయిందని, ఇప్పుడు 90 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.

అంతరాష్ట్ర జల వివాదాలు పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టులు ఆపాలన్నది ప్రధాన పాయింట్. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కరువు ప్రాంతమని, వలసలకు గురైన ప్రాంతంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితులును దృష్టిలో పెట్టుకుని నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టిందన్నారు.

ALSO READ:  సీక్రెట్‌గా సమాచారం ఇస్తే..  లక్ష్మాజీపల్లి బంపరాఫర్

అయితే నిర్మాణంలో సరైన రీతిలో పురోగతి లేకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనాలు, వ్యయాలు విపరీతంగా పెరిగినట్టు అందులో ప్రస్తావించారు. పై అంశాలను పరిగణనలోకి తీసుకుని 90 టీఎంసీలతో తాగునీటి, సాగునీటి సంబంధించి అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరుతూ తీర్మానం చేసింది. చివరకు ప్రాజెక్టు అంశం ప్రస్తుతం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×