E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు – వారికి చేపట్టిన పనుల్లో అవాంతరాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు – వారికి చేపట్టిన పనుల్లో అవాంతరాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 5వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

బంధువులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.  నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

వృషభం

Advertisement

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా చికాకు పరుస్తాయి.  చేపట్టిన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. దాయదులతో స్థిరస్తి  వివాదాలు కలుగుతాయి. 

మిథునం

ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.  చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో  చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో  ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

Advertisement

భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఒక వ్యవహారంలో  ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం

బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగైన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మంద కోడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. 

కన్య

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. బంధువర్గంతో వివాదాలు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య  విషయంలో జాగ్రత్త అవసరం.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బందు  వర్గంతో వివాదాలు కొంత బాధిస్తాయి.

వృశ్చికం

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. గృహ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. 

ధనుస్సు

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో స్థిరస్తి  ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి.

మకరం

ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన వస్త్రాభరణాలు  కొనుగోలు చేస్తారు.  

కుంభం

ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

మీనం

విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి.  చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×