E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – వారికి నూతన వాహన యోగం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – వారికి నూతన వాహన యోగం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 12వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమపెరుగుతుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. 

వృషభం

Advertisement

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోభాధలు అధికమౌతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. 

మిథునం

వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పనిఒత్తిడి నుండి బయటపడతారు. 

కర్కాటకం

Advertisement

ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

సింహం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. 

కన్య

చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

వృశ్చికం

బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి. 

ధనుస్సు

చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు కలసిరావు.  

మకరం

ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. 

కుంభం

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×