E-Paper
Advertisement

Kasarla Shyam: నా కెరీర్‌లో ఈ పాట ఇచ్చినంత కిక్కు.. ఏ పాట ఇవ్వలేదు!

Kasarla Shyam: నా కెరీర్‌లో ఈ పాట ఇచ్చినంత కిక్కు.. ఏ పాట ఇవ్వలేదు!
Advertisement

Kasarla Shyam: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ మూవీకి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ‘ఆయా షేర్’ ప్రపంచవ్యాప్తంగా టా‌ప్‌లో ట్రెండ్ అవుతూ భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమా ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ‘ఆయా షేర్’ సాంగ్‌కి వస్తున్న స్పందనతో లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) మీడియాకు తన సంతోషాన్ని తెలియజేశారు.

Also Read- Anjana Devi: చిరంజీవి మదర్‌కు విశ్వ మహిళ అవార్డ్.. ఇంకా ఎవరెవరికంటే?

ఆ కిక్ ఏ పాట ఇవ్వలేదు

Advertisement

ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ‘‘ఆయా షేర్ పాట ప్రోమో నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. పాట రిలీజ్ తర్వాత అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ అందరికీ నచ్చింది. అనిరుధ్ నేను ఇచ్చిన పదాలు తీసుకొని జనాలకి రీచ్ అయ్యేవిధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య ఈ పాటను అద్భుతంగా పాడారు. ఇంత ఫిరోషియస్ సాంగ్‌లో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజం చెప్పాలంటే.. నా కెరీర్లో ఈ పాట ఇచ్చినంత కిక్కు.. మరే పాట ఇవ్వలేదు. నేను ఉపయోగించిన భాష, యాసకి సోషల్ మీడియాలోని నెటిజన్లు కూడా అద్భుతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పాట రిలీజ్ తర్వాత నాకు చాలా మెసేజుల వచ్చాయి. జీవితంలో సర్వస్వం కోల్పోయానని బాధపడే ఓ వ్యక్తి.. ఈ పాట విని ఒక కొత్త స్ఫూర్తి పొందానని చెప్పాడు. అలాంటి మెసేజ్‌లు చాలా వచ్చాయి. ఈ స్పందన నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

Also Read- Kissik Talks: తప్పు చేసిన వాళ్లకి వెంటనే శిక్ష పడాలి.. ‘లా’ పై లయ అసహనం

అందుకే పాటలో ఉర్దూ పదాలు

Advertisement

ఈ సినిమాలో నాని పాత్రలో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది. ఇప్పుడందరూ ఆ జడలు గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా చూసిన తర్వాత వాటికి అద్భుతమైన జస్టిఫికేషన్ ఉందనుకుంటారు. సోషల్ మీడియాలో చూస్తుంటే.. జడలు వేసుకునే రీల్స్ చేస్తున్నారు. ఆ కల్చర్‌ని గుర్తు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అనిరుధ్ పాట చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొడుతున్నామని చెప్పారు. ఆయనతో వర్కింగ్ ప్రాసెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. ఈ పాట సక్సెస్‌కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్. జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాటగా ఇది ఉంటుంది. ఈరోజు అందరి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుందంటే.. ఆయన ఎంతగా ఈ పాట కోసం తపించి ఉంటాడో కదా. ఈ పాట రాయడానికి నాకు వారం రోజులు పట్టింది. కొన్ని వెర్షన్స్ డెవలప్ చేసుకుంటూ చివరికి దీనిని ఫిక్స్ చేశాం. కాకపోతే సాంగ్ సెంట్రల్ ఐడియా మాత్రం వెంటనే లాక్ చేశాం. శ్రీకాంత్ ఈ పాట గురించి పూర్తిగా వివరించారు. ఒక జాతి కష్టం నుంచి పుట్టే ఒక యోధుడు, ఆ జాతికి స్ఫూర్తి నింపే నేపథ్యంలో వచ్చే పాటిది. 80 దశకాల్లో జరిగే నేపథ్యం కాబట్టి అప్పుడు ఉర్దూ ప్రభావం ఉంటుంది. అందుకే ఇందులో చాలా వరకు ఉర్దూ పదాలు ఉపయోగించడం జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Chota K Naidu: ‘అంజి’ సినిమాకి తలెత్తుకుని పని చేస్తే.. ‘విశ్వంభర’కి తలదించుకుని పని చేస్తున్నా!

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×