E-Paper
Advertisement

Monthly Horoscope in Telugu: ‘మార్చి రాశిఫలాలు’ : ఈనెలలో ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అద్బుతంగా ఉంటుంది

Monthly Horoscope in Telugu: ‘మార్చి రాశిఫలాలు’ :  ఈనెలలో ఆ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అద్బుతంగా ఉంటుంది
Advertisement

Monthly Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి నెల రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

ఈ నెల ఈ రాశి వారు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు నుండి బయట పడతారు. బంధుమిత్రులు సమాగమం ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్ విషయంలో కీలక సమాచారం అందుతుంది.

వృషభ రాశి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి ఆలోచనా విధానంలో ఆకస్మిక మార్పులు చేయడం వలన ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. భూ సంబంధిత వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

మిథున రాశి:  

ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా కలచి వేస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసంతమున వివాహది శుభాకార్యాలకు హాజరువుతారు. ప్రముఖులతో పరిచయాలు కొంత ఊరట కలిగిస్తాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఈ నెలలో  ఈ రాశి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు చేయిదాటి పోతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. సంతాన పరమైన సమస్యలు వలన మానసిక చికాకులు పెరుగుతాయి. వాహన ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపార విషయంలో పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

సింహరాశి:

ఈ నెలలో ఈ రాశి వారు మంచి మాట తీరుతో ఇంటాబయటా అందరినీ ఆకట్టుకుంటారు. వ్యతిరేకులకు సైతం అవసరానికి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామితో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వ్యాపారాలు విస్తరిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి.

కన్యారాశి :

ఈ నెలలో ఈ రాశి వారు వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. సంతాన వివాహాది శుభకార్య ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమునకు బంధుమిత్రులరాక ఆనందం కలిగిస్తుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. ఋణగ్రస్తుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఊహించని లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్య అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు రాశి:

ఈ నెలలో ఈ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మాసం మధ్య నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కొన్ని వ్యవహారాలలో కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు సాగటం మంచిది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి.

మకరరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కళత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలు తప్పవు. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృ వర్గీయులతో మాటపట్టింపులు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

కుంభరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆరోగ్యం సహకరించక కొన్ని పనులు వాయిదా వేస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు వియోగం మానసికంగా కొంత కలచివేస్తుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి ఉద్యోగాలలో చెయ్యని పనికి నిందలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలు ఎదుర్కొంటారు.

మీనరాశి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహంగా సాగుతుంది. పాత ఋణాలు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరు అవుతారు. ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో విజయం సాదిస్తారు. జీవిత భాగస్వామితో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×