ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (మార్చి 01 – మార్చి 07) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీరు శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం నుండి ఊరట లభిస్తుంది. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరన స్వల్ప ధన వ్యయ సూచనలున్నవి.
ఈ వారం మీకు మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను సైతం తీర్చగలుగుతారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు రాజీ చేసుకుంటారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.
ఈ వారం మీకు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రులను కలుసుకుని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో సకాలంలో పెట్టుబడులు అందక కొంత నష్టం తప్పదు. ఉద్యోగ విషయంలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. అన్ని రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ఈ వారం మీకు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు లో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వారం ప్రారంభంలో అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది.
ఈ వారం మీరు చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకొన్న సమయానికి ధనసహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
ఈ వారం మీరు స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగా అవకాశాలు దక్కుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.
ఈ వారం మీరు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదురులతో కొన్ని వ్యవహారాలు కొంత చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. కొన్ని రంగాలవారికి నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
ఈ వారం మీకు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలలో జాప్యం తప్పదు. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకోవడం విఫలమవుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం లభిస్తుంది.
ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. కొన్ని రంగాల వారికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్య సిద్ధి కలుగుతుంది
ఈ వారం మీరు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆదరణ పొందుతారు. అన్ని రంగాల వారికి దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయటపడతారు. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఈ వారం మీకు కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్ధిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. తల్లి తండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈ వారం మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం కొంత సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో భూవివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.