E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వ్యాపారాల్లో నష్టాలు – వారికి ఆర్థిక లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వ్యాపారాల్లో నష్టాలు – వారికి ఆర్థిక లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం


నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల అనుగ్రహంతో కీలకమైన పనులు పూర్తిచేస్తారు.  వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. 

వృషభం

Advertisement

కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. కీలక విషయాలలో అలోచించి ముందుకు సాగాలి. 

మిథునం

అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారములలో నష్ట సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. 

కర్కాటకం

Advertisement

వృత్తి ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బంధు, మిత్రులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగములలో బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు కలుగుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నేత్ర సంభందిత సమస్యలు కలుగుతాయి. 

కన్య

కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశములు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మొండి బాకీలు ఋణాలు తీర్చగలుగుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల


గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

వృశ్చికం

కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్ని పనులు అనుకూలంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

ధనుస్సు

మొండి బాకీలు వసూలు అవుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటరు. వృత్తి,ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.  

మకరం

ఇతరులతో అలోచించి మాట్లాడటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. 

కుంభం

నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. బంధుమిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

మీనం

వ్యాపార విషయమై పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. విద్యార్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాల నుండి బయట పడతారు. ఆర్ధిక విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×