E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం


దూర ప్రయాణాలు ఇబ్బందికరంగా సాగుతాయి. బంధు మిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. అన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సరిపడినంత ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

వృషభం

Advertisement

ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పదవులు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యములకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారములలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. 

మిథునం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. నిరుద్యోగులకు అందివచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. 

కర్కాటకం

Advertisement

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరపు బంధువుల నుండి ఊహించని వార్తలు వినవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఋణ సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. 

కన్య

ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ప్రముఖుల పరిచయాల వలన అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. పాత బాకీలు తీర్చగలుగుతారు. వ్యాపార విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల


సోదరులు నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

ఇంటా బయట ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు అంతగా కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. వృత్తి,వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. 

ధనుస్సు

ముఖ్యమైన వ్యవహారాలలో సమయానుకూలంగా నిర్ణయాలు అమలు చెయ్యలేరు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన రీతిగా ఉండవు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారులతో అలోచించి మాట్లాడటం మంచిది.  

మకరం

ఇంటా బయట మీ ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులని కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలని నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోభివృద్ధి కలుగుతుంది. 

కుంభం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధనపరంగా ఊహించని చిక్కులు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మీనం

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. నూతనవస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్ధిరాస్తి సంభందిత వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×