E-Paper
Advertisement

Action series OTT: చావును గెలిచి దెయ్యాల వేట… మైండ్ బ్లాస్ట్ చేసేలా ఒక్కో ఎపిసోడ్

Action series OTT: చావును గెలిచి దెయ్యాల వేట… మైండ్ బ్లాస్ట్ చేసేలా ఒక్కో ఎపిసోడ్
Advertisement

Action series OTT : ఎంటర్టైన్ చేసే కంటెంట్ కావాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను చూసేయచ్చు. ఇది హారర్, కామెడీ, యాక్షన్ కలగలిసిన గోతిక్ స్టైల్‌లో ఉంటుంది. చచ్చి బతికిన ఒక వ్యక్తి దెయ్యాలను వేటాడే క్రమంలో ఈ కథ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ లో ఈ దెయ్యాల వేట చాలా ఎంటర్టైన్ చేస్తుంది. విజువల్స్ అయితే మైండ్ బ్లాక్ చేస్తాయి ఇందులో. దీనికి ఐయండిబిలో ఏడుకు పైగా రేటింగ్ కూడా ఉంది. ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది ఈ సిరీస్ కు.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్ పేరు ‘ది బాండ్స్‌మన్’ (The Bondsman). ఇందులో హాలీవుడ్ స్టార్ కెవిన్ బేకన్ ప్రధాన పాత్రలో నటించారు. కెవిన్ బేకన్‌తో పాటు జెన్నిఫర్ నెటిల్స్, బెత్ గ్రాంట్, మాక్స్‌వెల్ జెంకిన్స్ కీలక పాత్రలు పోషించారు. దీనిని ప్రముఖ హారర్ చిత్రాల నిర్మాణ సంస్థ బ్లమ్‌హౌస్ టెలివిజన్ నిర్మించింది. అందుకే ఇందులో దెయ్యాలు, రక్తం చిందే సీన్లు రియలిస్టిక్‌గా ఉంటాయి. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లతో ప్రైమ్ వీడియోలో 2025 ఏప్రిల్ న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

హబ్ అనేవాడు ఒక మాస్ వ్యక్తి, పైసల కోసం ఎవరినైనా పట్టుకొచ్చే బౌంటీ హంటర్ పని చేస్తుంటాడు. ఒకసారి ఎవడో వీణ్ణి దారుణంగా చంపేస్తాడు. కానీ వీడి టైమ్ బాగుండి, నరకంలో ఉండే యమధర్మరాజు వీడికి ఒక ఆఫర్ ఇస్తాడు. నరకం నుండి కొంతమంది దెయ్యాలు తప్పించుకుని భూమి మీద తిరుగుతున్నాయి, వాళ్లని నువ్వు వేటాడి తిరిగి నా దగ్గరికి పట్టుకొస్తే.. నిన్ను మళ్ళీ బతికిస్తానని కండిషన్ పెడతాడు. అలా చచ్చిపోయిన హబ్, మళ్ళీ ప్రాణాలతో లేచి వస్తాడు. ఇక భూమి మీదకి తిరిగి వచ్చిన హబ్ కి మామూలు పవర్స్ రావు, అతను తన పాత గిటార్ పట్టుకుని, దెయ్యాలను వెతుక్కుంటూ వేట మొదలుపెడతాడు. అయితే అతను కేవలం దెయ్యాలనే కాదు, చనిపోకముందు వదిలేసిన పెళ్లాం, పిల్లలతో తన పాత జీవితాన్ని కూడా సెట్ చేసుకోవాలని ట్రై చేస్తాడు.

ఒక పక్క భయంకరమైన నరకం దెయ్యాలు, ఇంకోపక్క గిటార్ పట్టుకుని పాటలు పాడే తన పాత కోరిక.. ఈ రెండిటి మధ్య హబ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతి ఎపిసోడ్ లో ఒక్కో వెరైటీ దెయ్యాన్ని హబ్ చితక్కొట్టి నరకానికి పంపుతుంటాడు. ఇది చూడటానికి అచ్చం మన పాత ఊర మాస్ యాక్షన్ సినిమా లాగే ఉంటుంది. చివరికి హబ్ దెయ్యాల క్లియరెన్స్ ఎంతవరకు ఉంటుంది ? తన ఫ్యామిలీకి మళ్ళీ దగ్గర అవుతాడా ? ఈ సిరీస్ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ కామిడీ హారర్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : కోటీశ్వరుడి మాయలో అందాల పనిమనిషి… ఉక్కిరి బిక్కిరి చేసే భార్య బాగోతం… సిడ్నీ స్వీనీ హిట్ మూవీ తెలుగులో

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×