E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు – నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు – నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 24వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. 

వృషభం

Advertisement

ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. 

మిథునం

వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. 

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

సింహం

ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవచింతన పెరుగుతుంది. 

కన్య

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం

వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు. 

ధనుస్సు

బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.  

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కుంభం

వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు.

మీనం

ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×