E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధన వ్యయం – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధన వ్యయం – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 2వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దీర్ఘ కాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.  వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

మిథునం

బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

కర్కాటకం

Advertisement

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

సింహం

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఉద్యోగమున కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. 

కన్య

కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఆధ్యాత్మిక, సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ధన, వస్తు,వాహన లాభాలు ఉన్నవి. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వృత్తి,ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. 

ధనుస్సు

దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటాబయటా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది.  

మకరం

వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

కుంభం

ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార,ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.

మీనం

ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు. పనులు మందకొడిగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×