E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి దాయాదులతో సమస్యలు – వ్యాపారులకు లాభాలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి దాయాదులతో సమస్యలు – వ్యాపారులకు లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు కలిసిరావు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. 

వృషభం

Advertisement

సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

మిథునం

ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. 

కర్కాటకం

Advertisement

దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారంతో చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

వృశ్చికం

ఆదాయ మార్గాలు తగ్గుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. 

ధనుస్సు

ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారమున భాగస్తులతో సమస్యలు ఉంటాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  

మకరం

కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది. గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. 

కుంభం

మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం

వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి. సంతానం విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు. దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×