E-Paper
Advertisement

Indigo Special Flights: గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఇండిగో

Indigo Special Flights: గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఇండిగో
Advertisement

Indigo Special Flights: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో అక్కడున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిపోయిన విమాన సర్వీసులు గల్ఫ్ లోని వివిధ దేశాల నుంచి ఇండియాకు పాక్షికంగా సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా సౌదీ అరేబియా, జెడ్డా నుండి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది.

గల్ఫ్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్‌‌పై అమెరికా మధ్య దాడులు

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు యుద్ధానికి దిగాయి. దీంతో పశ్చిమాసియా వ్యాప్తంగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఫలితంగా చిక్కుకున్న భారతీయులకు ఉపశమనం కలిగింది. తాజాగా సోమవారం రాత్రి అబుదాబి నుండి ఓ విమానం న్యూఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ వివరాల మేరకు ఎతిహాద్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన ఓ విమానం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అబుదాబి నుండి బయలుదేరి రాత్రి 8.30 ఢిల్లీలో ల్యాండ్ అయింది.

అలాగే దుబాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి కార్యకలాపాలు పునరుద్ధరించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రముఖ విమానయాన సంస్థలు ఎమిరేట్స్, ఎతిహాద్ దీనిపై కీలక ప్రకటన చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి పరిమిత సంఖ్యలో విమానాలను నడుస్తున్నట్లు వెల్లడించాయి. తమ సేవలను దశలవా రీగా పునరుద్ధరిస్తున్నామని వెల్లడించాయి.

Advertisement

ప్రత్యేక విమానాలు నడుపుతున్న ఇండిగో, ఎయిర్ ఎక్స్‌ప్రెస్

టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తొలి ప్రయార్టీ ఇస్తామని ఎమిరేట్స్ తెలిపింది. సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి నేరుగా సమాచారం వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావాలని సూచన చేసింది. లేకుంటే ఎయిర్‌పోర్టుకు రావద్దని పేర్కొంది. మరోవైపు ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా యూఏఈ అధికారుల సమన్వయంతో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా గల్ఫ్ లోని పలు దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక విమానాలు నడుపుతోంది. మార్చి మూడున సౌదీ అరేబియా, జెడ్డా నుండి ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది. పైన పేర్కొన్న దేశాల నుంచి ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్‌ ప్రాంతాలకు ఆయా విమానాలు నడపనుంది.

గతంలో టికెట్లు బుక్ చేసుకుని ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రయాణించలేని కస్టమర్ల కోసం ఈ విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన అనుమతులు, గగనతల పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ విమానాలు సౌదీ అరేబియా నుండి భారత్ వస్తాయని తెలియజేసింది.

ALSO READ: రెండు సార్లు రైలు నుంచి కింద పడింది.. చివరికి, మూడోసారి..

చిక్కుకుపోయిన ప్రయాణీకులను తిరిగి తీసుకురావడానికి జెడ్డాలోని ఇండియా కాన్సులేట్ అధికారులోతమ సంస్థ సమన్వయం చేసుకుంటోందని తెలిపింది. మరింత సమాచారం లేదా సహాయం కోరుకునే కస్టమర్లు +91 124 6173838లో మా కాంటాక్ట్ సెంటర్‌ను సంప్రదించాలని పేర్కొంది. మా కస్టమర్ల అవగాహన, సహనానికి ధన్యవాదాలు తెలిపింది.

మా కస్టమర్లు, సిబ్బంది భద్రత శ్రేయస్సు మా అత్యంత ప్రాధాన్యతమని తెలిపింది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ ఒమన్‌లోని మస్కట్‌కు సేవలను తిరిగి ప్రారంభించనుంది. అక్కడి నుంచి భారత్ లోని వివిధ నగరాల నుండి ఆరు విమానాలను నడుపుతోంది.

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×