E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 03: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 03: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  మే 03వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

వృషభం

Advertisement

వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. 

మిథునం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

కర్కాటకం

Advertisement

బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం

చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. 

కన్య

చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. 

ధనుస్సు

స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.  

మకరం

బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 

కుంభం

ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×