E-Paper
Advertisement

జైలుకెళ్లి మరీ కిల్లర్లతో ఇంటర్వ్యూలు… సైకోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించే గూస్‌బంప్స్ సిరీస్

జైలుకెళ్లి మరీ కిల్లర్లతో ఇంటర్వ్యూలు… సైకోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూపించే గూస్‌బంప్స్ సిరీస్
Advertisement

Crime Thriller OTT : సీను సీనుకో ట్విస్ట్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో ఎన్నో ఉన్నాయి. కానీ అందులో బెస్ట్ మూవీని వెతుక్కోవడం అంటే కత్తి మీద సామె. మీరు కూడా ఇలాగే అనుకుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. పైగా ఇందులో సైకలాజికల్ అంశాలు కూడా మెండుగా ఉంటాయి. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ అద్భుతమైన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు Mindhunter (2017). 1970ల చివరలో అమెరికాలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ప్రస్తుతం భారతదేశంలో Netflix లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ఫించర్ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో పాటు చాలా ఎపిసోడ్లకు దర్శకత్వం కూడా వహించాం విశేషం. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కిల్లర్లుగా నటించిన నటుల పర్ఫార్మెన్స్ ఈ సిరీస్‌ను ఒక మాస్టర్ పీస్‌ గా నిలబెట్టాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎడ్ కెంపర్ పాత్రలో కెమెరాన్ బ్రిట్టన్ నటన ఆడియన్స్ ను భయపెట్టడం ఖాయం.

Advertisement

ఈ సిరీస్ మొత్తం రెండు సీజన్లు ఉండగా, మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూశారు. అయితే బడ్జెట్ సమస్యలు, ఇతర కారణాల వల్ల నెట్‌ఫ్లిక్స్ దీనిని ప్రస్తుతానికి ఆపేయడం జరిగింది. అసలు సీరియల్ కిల్లర్ అనే పదం ఎలా పుట్టింది ? క్రిమినల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను ఖచ్చితంగా చూడాల్సిందే. అన్నీ సిరీస్ లలాగా కేవలం రక్తపాతం చూపించడమే కాదు, మనిషి మెదడులోని క్రూరత్వాన్ని విశ్లేషించే ఒక లోతైన ప్రయాణం ఈ సిరీస్.

కథలోకి వెళ్తే…

ఎఫ్‌బిఐ (FBI) ఏజెంట్లు హోల్డెన్ ఫోర్డ్ – బిల్ టెంచ్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రధారులు. 1970ల కాలంలో కథ సాగుతుంది. అప్పట్లో అసలు నేరస్థులు ఎందుకు హత్యలు చేస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉండేదట. ఈ నేపథ్యంలోనే మన ఇద్దరు ఏజెంట్లు, సైకాలజిస్ట్ వెండి కార్ సహాయంతో ఆ అర్థం కాని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకోసం “బిహేవియరల్ సైన్స్ యూనిట్”ను ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా జైలులో ఉన్న క్రూరమైన సీరియల్ కిల్లర్లను ఇంటర్వ్యూ చేస్తారు. దీని ద్వారా వారి ఆలోచనా విధానాన్ని, మనస్తత్వాన్ని అధ్యయనం చేస్తారన్న మాట. ఫలితంగా కొత్తగా జరుగుతున్న హత్యలను ఆపడమే వీరి ప్రధాన లక్ష్యం.

Advertisement

Also Read : 400 ఏళ్ల దెయ్యాల రాణితో క్రేజీ లవ్… రెండు క్లైమాక్స్ లతో ఆకట్టుకుంటున్న కే డ్రామా

కిల్లర్లతో ముఖాముఖి అనేది స్టోరీలో ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఈ సిరీస్‌లో ఎడ్మండ్ కెంపర్, రిచర్డ్ స్పెక్, జెర్రీ బ్రుడోస్ వంటి రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్లను చూపించడం మరో ఆసక్తికరమైన అంశం. హోల్డెన్ ఫోర్డ్ వారితో మాట్లాడేటప్పుడు వారిలో ఒకడిగా మారిపోయి రహస్యాలను రాబట్టడం హైలెట్. ఈ క్రమంలోనే కిల్లర్ల కన్నింగ్ ఆలోచనలు హోల్డెన్ వ్యక్తిగత జీవితం మీద, మానసిక స్థితి మీద కూడా ఎఫెక్ట్ చూపుతాయి. రెండో సీజన్‌ లో అట్లాంటాలో పిల్లల వరుస హత్యల కేసును ఛేదించడానికి వీరు చేసే ప్రయత్నాలు నెక్స్ట్ లెవెల్. ఇంకా ఈ సిరీస్ ను చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Tags

Related News

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

Big Stories

Advertisement
×