E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 05: ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు – వారికి వ్యాపారాల్లో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 05: ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు – వారికి వ్యాపారాల్లో లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  మే 05వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. 

వృషభం

Advertisement

కీలక నిర్ణయాలలో సన్నిహితుల సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. 

మిథునం

కుటుంబ సభ్యులతో స్వల్ప మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. 

కర్కాటకం

Advertisement

కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు.

సింహం

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన వాహన యోగం ఉన్నది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

వృశ్చికం

ఇంటాబయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. 

ధనుస్సు

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. అధికారులతో చర్చలు ఫలిస్తాయి.  

మకరం

నిరుద్యోగుల యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 

కుంభం

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చెయ్యటం మంచిది కాదు. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

మీనం

ఆర్థిక పరిస్థితి కొంత మందకొడిగా సాగుతుంది. ధన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×