E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (16/11/2025) ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు శుభవార్తలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (16/11/2025) ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు శుభవార్తలు 

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృషభ రాశి:

చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మిథున రాశి:  

బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.

కర్కాటక రాశి:

వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

సింహరాశి:

వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది.

కన్యారాశి :

కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషానిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.

వృశ్చికరాశి:

ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

ధనస్సు రాశి:

సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

మకరరాశి:

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.

కుంభరాశి:

వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దాని పరంగా ఇబ్బందులు తప్పవు.

మీనరాశి:

దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.

 ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×