E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (20/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఆ రాశి ఉద్యోగులకు ఇబ్బందులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (20/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఆ రాశి ఉద్యోగులకు ఇబ్బందులు

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

వృషభ రాశి:

వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్నిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథున రాశి:  

వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.రు. 

కర్కాటక రాశి:

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.  

సింహరాశి:

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలు సహోద్యోగులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

కన్యారాశి :

సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృశ్చికరాశి:

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి మాటతీరుతో ఇంటా బయట అందరిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి:

వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

మకరరాశి:

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ యత్నాలు సానుకూల మౌతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మెరుగ్గా రాణిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుని బాధపడతారు.

కుంభరాశి:

సంతాన వివాహ విషయమై చర్చలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనరాశి:

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిఒత్తిడుల వలన తగిన విశ్రాంతి ఉండదు. ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×