IND vs SA: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది నవంబర్ 22వ తేదీ నుంచి రెండో టెస్ట్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ పూర్తయిన వెంటనే, దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య నవంబర్ 30వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ వన్డేలకు డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) ఇద్దరు దూరం కాబోతున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Hardik Pandya: ఆగలేకపోతున్న హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైరల్ !
నవంబర్ 30వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ వన్డే సిరీస్ కోసం ఇప్పటి వరకు జట్టును ప్రకటించలేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి. గిల్ కు గాయమైంది కాబట్టి, ఇప్పటికే రెండో టెస్టుకు దూరమయ్యాడు. వన్డే సిరీస్ ఆడేది డౌట్. ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే, వన్డే కెప్టెన్సీని రోహిత్ శర్మకు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇదంతా పక్కకు పెడితే, దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇద్దరు దూరం కాబోతున్నారట. ఇద్దరికీ రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రిక్వెస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
వచ్చే సంవత్సరం టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఎక్కువ ఇవ్వాలని గౌతమ్ గంభీర్ ఆలోచన చేస్తున్నారట. కానీ దక్షిణాఫ్రికాతో జరిగే టీ20లో మాత్రం ఆడించాలని గంభీర్ స్పష్టం చేశారట. ఇప్పటికే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఆడించి, ప్రమాదంలో పడకుండా ఉండాలని గంభీర్ అంటున్నారట. అటు బుమ్రాకు కూడా కేవలం టీ20లో ఛాన్స్ ఇవ్వాలని ఇప్పటికే సెలక్షన్ కమిటీకి లేఖ పంపించాడట గంభీర్. దీంతో వీళ్లిద్దరి స్థానంలో హర్షిత్ రాణాకు మాత్రం ప్లేస్ గ్యారంటీ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు టీమిండియా ఫ్యాన్స్. వాడొక్కడి కోసం ఇద్దరు ప్లేయర్లను గౌతమ్ గంభీర్ పక్కన పెడుతున్నాడని మండిపడుతున్నారు ఫ్యాన్స్. హార్దిక్ పాండ్యా స్థానంలో డేంజర్ ఆల్ రౌండర్ గా హర్షిత్ రాణాను బరిలోకి దించేందుకు ఈ కుట్రలకు గౌతమ్ గంభీర్ తేరలేపినట్లు చర్చ జరుగుతోంది.
Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?