E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (22/11/2025) ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో సక్సెస్ – వారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (22/11/2025) ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో సక్సెస్ – వారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

 వృత్తి, వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు లోటు పెరుగుతాయి. నిరుద్యోగులకు చాలకాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి:

Advertisement

వ్యాపారాలలో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.

మిథున రాశి:  

విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది.  

కర్కాటక రాశి:

Advertisement

దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు సేకరిస్తారు. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.  

సింహరాశి:

గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలను విస్తరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

కన్యారాశి :

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తులారాశి:

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులతో ఏర్పడిన వివాదాలు రాజిచేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కొన్ని వ్యవహారాలలో సోదరుల నుంచి సహాయ సహకాారాలు అందుతాయి.

వృశ్చికరాశి:

గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంతానానికి నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి:

చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు అధికారుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.

మకరరాశి:

వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. గృహనిర్మాణ ఆలోచనలు మందకోడిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషాన్నిస్తుంది.

కుంభరాశి:

విలువైన వస్త్రా, భరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.

మీనరాశి:

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×