E-Paper
Advertisement

OTT Movie : అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఈ కేటుగాడు… కంటిపై రెప్ప వేయడం మర్చిపోయేలా చేసే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఈ కేటుగాడు… కంటిపై రెప్ప వేయడం మర్చిపోయేలా చేసే క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : హాలీవుడ్ సినిమాలకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ కి రీచ్ అయ్యేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. డిఫరెంట్ కాన్సెప్ట్ ని ప్రజెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ థ్రిల్లర్ మూవీ గత ఏడాది థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరో ఎవరికీ కనిపించకుండా పెద్ద పెద్ద కంపెనీల సమస్యలను సాల్వ్ చేస్తుంటాడు. ఒక అమ్మాయి ఎంట్రీతో స్టోరీ థ్రిల్లర్ మోడ్ కి వెళ్తుంది. ఈ సినిమా చివరి వరకు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీతో కలసి హ్యాపీగా చూసేయచ్చు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘రిలే’ 2024లో విడుదలైన అమెరికన్ థ్రిల్లర్ చిత్రం. ఇది డేవిడ్ మెకెంజీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో రిజ్ అహ్మద్, లిల్లీ జేమ్స్ సామ్ వర్తింగ్టన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ 2024 సెప్టెంబర్ 8న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌ను ప్రదర్శించింది. 2025 ఆగస్ట్ 22న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యాష్ అనే ఒక ఇంటెలిజెంట్ యువకుడు, బయటికి చూడటానికి సాధారణ మనిషి లాగే ఉంటాడు. కానీ అతని పని భలే డేంజర్ గా ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీల అంతర్గత సమాచారాన్ని బయట పెట్టాలనుకునే వాళ్లకి డబ్బిచ్చి, లేక మరోలా డీల్ చేసి నోరు మూయిస్తుంటాడు. ఆ తరువాత కంపెనీలతో డీల్ చేస్తుంటాడు.  అంటే ఒక రకంగా ఫిక్సర్ లా వ్యవహరిస్తుంటాడు. అతను ఎవరితోనూ డైరెక్ట్‌గా మాట్లాడడు, ఫేస్ టు ఫేస్ కలవడు. బూతు మాటలు, బెదిరింపులు, హింస కూడా వాడడు. కేవలం డబ్బు, స్మార్ట్ ప్లానింగ్‌తోనే సమస్యలు సాల్వ్ చేస్తాడు. యాష్ తన గుర్తింపును రహస్యంగా ఉంచడానికి, ఒక వినూత్నమైన పద్ధతిని ఉపయోగిస్తాడు. వినికిడి లోపం ఉన్నవారి కోసం వాడే తక్కువ సాంకేతికత కలిగిన టెలికమ్యూనికేషన్స్ రిలే సర్వీస్‌ను ఉపయోగిస్తాడు. దీని వల్ల ఎవరూ అతని వాయిస్, లొకేషన్ ట్రేస్ చేయలేరు.

Read Also : డబ్బులిచ్చి చిన్న పిల్లతో పెళ్లి… ఈ బంగారు తల్లికి వచ్చిన కష్టం ఇంకే ఆడపిల్లకు రావొద్దు భయ్యా

ఒక రోజు సారా అనే అమ్మాయి అతని దగ్గరికి వస్తుంది. ఆమె పనిచేసే పెద్ద బయోకెమికల్ కంపెనీలో ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఒక భయంకర సీక్రెట్ ఉంది. ఆమె దాన్ని బయటపెట్టాలనుకుంటుంది. కానీ కంపెనీ ఆమెను చంపేయాలని చూస్తోంది. యాష్ మొదట్లో ఈ కేసు తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ తీసుకున్నాక తెలుస్తుంది ఈ సారి విషయం చాలా పెద్దదని. ఒక వేళ ఆ విషయం బయటకి వస్తే కంపెనీకి బిలియన్ డాలర్లు లాస్ అవుతుంది. ఇప్పుడు యాష్ తన జీవితంలో మొదటిసారి తన స్ట్రిక్ట్ రూల్స్ బ్రేక్ చేసి, సారాను డైరెక్ట్‌గా కలిసి కాపాడాలని ట్రై చేస్తాడు. కానీ అదే టైమ్ లో కంపెనీ వాళ్లు అతన్ని ట్రాక్ చేసి, రివెంజ్ తీర్చుకోవడానికి వస్తారు. అప్పటి నుంచి సినిమా మొత్తం ఒక భయంకరమైన గేమ్ లా సాగుతుంది. చివరికి సారాని యాష్ కాపాడతాడా ? ఈ ఎండింగ్ ఎలా వుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×