E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం నిరుద్యోగులకు శుభవార్తలు – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకోని లాభాలు

Weekly Horoscope: ఈ వారం నిరుద్యోగులకు శుభవార్తలు – రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకోని లాభాలు
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (డిసెంబర్‌ 21 – డిసెంబర్‌ 27) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం  దూరపు బంధువుల నుండి శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తరణకు మార్గం సుగమమవుతుంది. ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అన్ని రంగాల వారికీ నూతన అవకాశములు అందుతాయి. రుణాలు కొంతవరకు తీరుస్తారు వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూరప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం   ఇంటాబయటా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తి కరంగా సాగుతాయి. మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు. 

 మిథున రాశి: 

ఈ వారం అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారు సమస్యల నుంచి గట్టెక్కుతారు. వారం మధ్యలో స్ధిరాస్తి వివాదాలుంటాయి. దూర ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేసుకుంటారు. నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం  అవసరానికి డబ్బు అందుతుంది. సంఘంలో సేవకార్యక్రమాలలో పాల్గొంటారు. వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల తో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలోఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో తగినగుర్తింపు లభిస్తుంది. వారం చివరన సోదరులతో ఆర్ధికవివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహారాశి:

ఈ వారం  వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరాక నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మిత్రులు కూడా శత్రులవలె ప్రవర్తిస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత మెరుగుపడుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

 కన్యా రాశి: 

 ఈ వారం స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ చూపించి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. దుర్గా దేవి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం  కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి.  భూ సంభందిత క్రయ విక్రయాలులో అవరోధాలు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో ఊహించని విధంగా లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారి శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులుంటాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి: 

ఈ వారం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారంచివరిలో పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. మేధో దక్షిణా మూర్తి స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ధనస్సు రాశి:

 ఈ వారం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణదాతల ఒత్తిడి నుండి బయట పడతారు. వృత్తి వ్యాపారాలలో సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. వారం మధ్యలోకుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ధన వ్యవహారాలునిరాశ కలిగిస్తాయి. హయగ్రీవ స్వామి ఆరాధనా చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మకర రాశి:

 ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామి నుండి స్ధిరాస్తి లాభం కలుగుతుంది. గృహ నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య భంగం రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కుంభ రాశి: 

 ఈ వారం ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆలయాలు సందర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల సహాయంతో గృహ నిర్మాణాలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల నూతన ప్రోత్సాహకరంగా సాగి నూతన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూలత పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. ఊహించని సమస్యలు కలుగుతాయి. శివాలయం దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మీన రాశి:

 ఈ వారం మీకు  ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది. కుటుంబ విషయమై తీసుకున్న నిర్ణయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంటాబయటా ఉత్సహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభ వార్తలు అందుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. గణపతిని ఆరాదించండం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×