E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 21వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. 

వృషభం

Advertisement

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.  సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగతుంది. 

మిథునం

ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

కర్కాటకం

Advertisement

వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ప్రతి బంధకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

సింహం

వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 

కన్య

నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.  ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి.  సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. 

ధనుస్సు

వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.  దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

మకరం

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

కుంభం

ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాల వలన నష్టాలు తప్పవు.

మీనం

నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాల నిర్వహణ పై చర్చలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×