ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (డిసెంబర్ 28 – జనవరి 03) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీకు సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై పెద్దలతో చర్చలు చేస్తారు. గృహ నిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు క్రమ క్రమంగా లాభాల బాట పడుతాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. గణనాయక అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ వారం మీకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు.
ఈ వారం మీరు స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వారం మధ్యలో ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు అనుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి వారి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో శుభవార్తలు ఉంటాయి. సూర్యాష్టకం పఠించండి.
ఈ వారం మీకు ఆర్థికంగా మరింత లాభాలు చేకూరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వివాదాన్ని అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి. పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలలో విజయం లబిస్తాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు కలసిరావు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ఈ వారం మీకు రావలసిన డబ్బు అంది అవసరాలు తీర్చుకుంటారు. శత్రువులను కూడా ఆకట్టుకుని మీ దారికి తెచ్చుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ ఆమోదిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు ఉంటాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
ఈ వారం మీరు ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. మీ అంచనాలు, ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారి యత్నాలు నిదానంగా సాగుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు కలుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ఈ వారం మీకు ఆర్థికంగా బలం చేకూరి ఊరట చెందుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు ఉన్నవి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ ప్రార్ధనలు మంచిది.
ఈ వారం మీకు చేపట్టిన పనులు నెమ్మదించి సహనాన్ని పరీక్షిస్తాయి. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం, ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు వల్ల ధనలబ్ధి కలుగుతుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ఈ వారం మీకు ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను బంధువులు హర్షిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు ఉంటాయి. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.
ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆస్తుల క్రయవిక్రయాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు ఉంటాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
ఈ వారం మీకు సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. యుక్తితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రీమహాలక్ష్మీ అష్టకం పఠించండి.
ఈ వారం మీకు ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడి ఊరట చెందుతారు. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పఠించండి.