E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు – వారికి అరుదైన ఆహ్వానాలు

Weekly Horoscope: ఈ వారం ఆ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో లాభాలు – వారికి అరుదైన ఆహ్వానాలు
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (జనవరి 11 – జనవరి 17) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం మీకు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. గృహ నిర్మాణయత్నాలు మరింత పుంజుకుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబసభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు సాధిస్తారు. అన్నిరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.  

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం మీకు ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. కొన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానం విద్యా విషయాల అనుకూలంగా సాగుతాయి. వారం మధ్యలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.  

 మిథున రాశి: 

ఈ వారం మీరు  పాత మిత్రులను కలుసుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తి లాభ సూచనలు ఉన్నవి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాముల సహాయ సహకారాలతో మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి విశేషమైన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో చిన్న చికాకులు బాధిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీరు సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాలపై శుభవార్తలు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన స్థాన చలానాలు ఉంటాయి. కొన్ని రంగాలవారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శారీరక మానసిక సమస్యలు తొలగుతాయి. నవగ్రహారాధన చేయటం వలన శుభ ఫలితాలు పొందుతారు.  

సింహారాశి:

ఈ వారం  మీకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడే విధంగా ఉంటాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకోవటంలో సఫలమవుతారు. ఉద్యోగస్తులు మంచి పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.  

 కన్యా రాశి: 

 ఈ వారం మీరు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బందు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించిన లాభాల అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారాంతమున వ్యయ ప్రయాసలతోకానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి.  

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీకు  సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి.  

వృశ్చిక రాశి: 

ఈ వారం మీకు ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో అంచనాలు అందుకుంటారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కారానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి. గృహమున శుభకార్యాలు గూర్చి ప్రస్తావన వస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగ విషయంలో ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారం ప్రారంభంలో రుణ వత్తిడి పెరుగుతుంది. శిరో బాధలు కలుగుతాయి.  

ధనస్సు రాశి:

 ఈ వారం మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో సన్నిహితులు సలహాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఊహించని పెట్టుబడులు అందుతాయి. దూర ప్రయాణాలు కలసివస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.  

మకర రాశి:

 ఈ వారం మీకు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ సంబంధిత సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యన దూరపు బంధువుల నుండి శుభకార్యం ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.   

కుంభ రాశి: 

 ఈ వారం మీ  స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సాయపడతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు అందుతాయి. కొన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. సంతాన విద్యా విషయాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  

మీన రాశి:

 ఈ వారం మీరు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజ పెద్దలతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగుతాయి. చిన్న తరహాపరిశ్రమలకు నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికమవుతాయి. ఇంట్లో ఒత్తిడి పెరుగుతుంది.   

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×