E-Paper
Advertisement

Ind vs NZ ODI Series: నేడే న్యూజిలాండ్ తో వ‌న్డే మ్యాచ్‌..సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్..టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే

Ind vs NZ ODI Series: నేడే న్యూజిలాండ్ తో వ‌న్డే మ్యాచ్‌..సిరీస్ నుంచి రిషబ్ పంత్ ఔట్..టైమింగ్స్‌, ఫ్రీగా చూడాలంటే

Ind vs NZ ODI Series: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI ) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్, ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా మొత్తం మూడు వన్డేల జరగనున్నాయి. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ తో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ మేరకు మూడు రోజుల నుంచి నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఎలాగైనా ఆడాలన్న కసితో రోకో కాంబినేషన్ ప్రాక్టీస్ చేస్తోంది.

Also Read: Ind vs NZ ODI Series: గంభీర్ బౌలింగ్ లో చిత‌క‌బాదిన విరాట్ కోహ్లీ..న్యూజిలాండ్ వ‌న్డే సిరీస్‌ షెడ్యూల్

నేటి నుంచే 3 వ‌న్డేల‌ సిరీస్ ప్రారంభం

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ తొలి వన్డే వడోద‌ర‌ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే టాస్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకే ఉండనుంది. ఇక ఈ మ్యాచ్ లు జియో హాట్ స్టార్ వేదికగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ లు వస్తాయి.

రిషబ్ పంత్ కు గాయం

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 1st ODI ) మధ్య ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ నేపథ్యంలో గిల్ సేనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిన్న ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయమైంది. ఈ గాయం కారణంగా 3 వన్డేల సిరీస్ కు రిషబ్ పంత్ దూరమైనట్లు చెబుతున్నారు. అయితే దీనిపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక అత‌ని స్థానంలో ఎవ‌రిని తీసుకుంటారో చూడాలి. కాగా జనవరి 14వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండవ వన్డే అలాగే జనవరి 18వ తేదీన మూడవ వన్డే జరగనుంది.

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్ ( Team India): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ ప్రాబబుల్ ఎలెవన్ ( New zealand): డెవాన్ కాన్వే (వైస్ కెప్టెన్), విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ ( కెప్టెన్), జోష్ క్లార్క్‌సన్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్, మైఖేల్ రే.

Also Read: Tilak Varma Surgery: తెలుగోడు తిల‌క్ వ‌ర్మ‌కు ఘోర అవ‌మానం..ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు పెట్టి దారుణం ?

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×