E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం ఆ రాశి కళాకారులకు శుభవార్తలు అందుతాయి – రాజకీయ నాయకులకు పదవీయోగం

Weekly Horoscope: ఈ వారం ఆ రాశి కళాకారులకు శుభవార్తలు అందుతాయి – రాజకీయ నాయకులకు పదవీయోగం
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (జనవరి 18 – జనవరి 24) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం మీకు వృత్తి మరియు ఆర్థిక రంగాల్లో బలమైన వృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. చిన్న తరహా పరిశ్రమలు క్రమ క్రమంగా లాభాల బాట పడుతాయి. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. గణనాయక అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం మీకు పనుల్లో ఆటంకాలు తొలగి, ఆర్థికంగా అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి.  వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. కొన్ని రంగాల వారికి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందగలుగుతారు. 

 మిథున రాశి: 

ఈ వారం మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి వారి ఆశలు అంతగా ఫలించవు. వారం చివరిలో శుభవార్తలు ఉంటాయి.  సూర్యాష్టకం పఠించండి.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీకు భూమి లేదా వాహన క్రయవిక్రయాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులకు సిద్ధపడాలి. పారిశ్రామికవర్గాలకు వ్యవహారాలలో విజయం లబిస్తాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు కలసిరావు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహారాశి:

ఈ వారం  మీకు రియల్ ఎస్టేట్ రంగంలో  లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నిర్ణయాలను అందరూ ఆమోదిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు, ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు ఉంటాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

 కన్యా రాశి: 

 ఈ వారం మీరు చేసే పనుల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారి యత్నాలు నిదానంగా సాగుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు కలుగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీకు సామాజిక గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు ఉన్నవి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ ప్రార్ధనలు మంచిది.

వృశ్చిక రాశి: 

ఈ వారం మీకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగవుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం, ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు వల్ల ధనలబ్ధి కలుగుతుంది. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనస్సు రాశి:

 ఈ వారం మీకు  ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి. మీ నిర్ణయాలను బంధువులు హర్షిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు ఉంటాయి. వారం చివరిలో ఆకస్మిక ప్రయాణాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మకర రాశి:

 ఈ వారం మీకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. బంధుమిత్రులతో విబేధాలు వచ్చే అవకాశం ఉన్నందున మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. విద్యార్థులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు ఉంటాయి. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభ రాశి: 

 ఈ వారం మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. యుక్తితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రీమహాలక్ష్మీ అష్టకం పఠించండి.

మీన రాశి:

 ఈ వారం మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుంటారు.  వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు ఉంటాయి.  హనుమాన్ చాలీసా పఠించండి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×