ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (మార్చి 29 – ఏప్రిల్ 04) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీకు ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు.
ఈ వారం మీ చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు.
ఈ వారం మీ వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు సమసిపోతాయి. ఆలయ దర్శనాలు తీసుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి. అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.
ఈ వారం మీకు వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు కలసిరావు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.
ఈ వారం మీకు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.
ఈ వారం మీకు వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి.
ఈ వారం మీకు నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. పాత మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
ఈ వారం మీకు వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు. అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
ఈ వారం మీకు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఈ వారం మీకు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా అవుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
ఈ వారం మీకు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ఈ వారం మీకు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.