E-Paper
Advertisement

Horror Thriller OTT : మర్రిచెట్టు నీడలో భయపెట్టే ఆత్మ… జడిపిస్తున్న ఒక్కో ఎపిసోడ్

Horror Thriller OTT : మర్రిచెట్టు నీడలో భయపెట్టే ఆత్మ… జడిపిస్తున్న ఒక్కో ఎపిసోడ్
Advertisement

Horror Thriller OTT : ఒక బోర్డింగ్ స్కూల్ నేపథ్యంలో వచ్చిన హారర్ సిరీస్ ప్రేక్షకులను బాగానే భయపెడుతోంది. ఈ కథలో 15 ఏళ్ల రీయూనియన్ కోసం మళ్లీ స్కూల్‌కు పాత విద్యార్థులు రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ కథ అంతా ఊటీలోని చలికాలం నేపథ్యంలో సాగుతుంది. అక్కడి పొగమంచు, పాతకాలపు బోర్డింగ్ స్కూల్ భవనం ఈ హారర్ థ్రిల్లర్‌కు పర్ఫెక్ట్ అట్మాస్పియర్‌ని ఇచ్చాయి. సిరీస్ ని చూడకపోతే ఓ లుక్ వేయండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2023లో వచ్చిన ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘అధుర’ (Adhura). అనన్య బెనర్జీ, గౌరవ్ కె. చావ్లా దీనిని రూపొందించారు. ఈ సిరీస్‌లో ఇష్వాక్ సింగ్ (రాకెట్ బాయ్స్ ఫేమ్) అధిరాజ్ పాత్రలో, రసిక దుగ్గల్ (మీర్జాపూర్ ఫేమ్) స్కూల్ కౌన్సిలర్ సుప్రియగా నటించారు. చిన్న అబ్బాయి వేదాంత్ పాత్రలో శ్రేణిక్ అరోరా తన నటనతో అందరినీ భయపెట్టాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎమ్మే ఎంటర్టైన్మెంట్ దీనిని నిర్మించింది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ 2023 జూలై 7 న ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ కి వచ్చింది .

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ అంతా ఊటీలోని ఒక పేరున్న పెద్ద బోర్డింగ్ స్కూల్ చుట్టూ తిరుగుతుంది. కథలో 2007 బ్యాచ్ విద్యార్థులు 15 ఏళ్ల తరువాత మళ్ళీ కలుసుకోవడడానికి స్కూల్‌కు వస్తారు. అందులో ఒకడైన అధిరాజ్ (ఇష్వాక్ సింగ్), తన ప్రాణ స్నేహితుడు నినాద్ గురించి వెతుకుతుంటాడు. స్కూల్ రోజుల్లో నినాద్‌ను అందరూ ఏడిపించేవాళ్ళు, ఆ తర్వాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. మరోవైపు, అదే స్కూల్‌లో ప్రస్తుతం చదువుతున్న వేదాంత్ అనే పదేళ్ల అబ్బాయి ప్రవర్తన వింతగా మారుతుంది. మిగతా పిల్లలు అతన్ని భయపెడుతుంటే, వేదాంత్ ఒంట్లోకి ఏదో ఆత్మ ప్రవేశించినట్లు ప్రవర్తిస్తుంటాడు. స్కూల్ కౌన్సిలర్ సుప్రియ (రసిక దుగ్గల్) అతనికి ఏదో సమస్య ఉందని గమనిస్తుంది.

విచిత్రం ఏమిటంటే, వేదాంత్ ప్రవర్తనకు, 15 ఏళ్ల క్రితం అదృశ్యమైన నినాద్‌కు ఏదో తెలియని సంబంధం ఉన్నట్లు అధిరాజ్ గుర్తిస్తాడు.చివరికి 2007లో ఆ స్కూల్ చివరి రోజున అసలు ఏం జరిగిందనే భయంకరమైన నిజం బయటపడుతుంది. నినాద్ అదృశ్యం వెనుక స్నేహితులే చేసిన ఒక పెద్ద తప్పు ఉందని, ఇప్పుడు ఆ ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి వేదాంత్ ద్వారా తిరిగి వచ్చిందని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆత్మ ఒక్కొక్కరిని భయంకరంగా వేటాడుతుంటుంది. చివరికి అధిరాజ్ తన స్నేహితుడికి న్యాయం చేశాడా ? అసలు 2007 లో ఏం జరిగింది ? ఈ కథ ముగింపు ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  అమెరికన్ సినిమాలో ఇండియన్ దెయ్యం… దోస్తులందరికీ చుక్కలు… మస్తు పరేషాన్ చేసే సినిమా

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×