E-Paper
Advertisement

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 16 – నవంబర్‌ 22)  ఆ రాశి వారికి ఆకస్మిక ధన వ్యయం – ఉద్యోగులకు ప్రమోషన్లు  

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 16 – నవంబర్‌ 22)  ఆ రాశి వారికి ఆకస్మిక ధన వ్యయం – ఉద్యోగులకు ప్రమోషన్లు  
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (నవంబర్‌ 16 – నవంబర్‌ 22) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

 ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘ కాలిక రుణాలు తీర్చాగలుగుతారు. గృహమున శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు అదిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగస్థులు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరన స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. రామ రక్షా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితలు పొందుతారు.

వృషభ రాశి: 

Advertisement

 ఈ వారం మీకు సంతాన విద్య ఉద్యోగ విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశములు అందుతాయి. వారం ప్రారంభంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఏదో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

 మిథున రాశి: 

ఈ వారం మీకు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో మనస్పర్ధలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పంచముఖ హనుమత్ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకూ బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కీలక విషయాలను గురించి చర్చిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం మధ్యలో చేపట్టిన పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

 సింహారాశి:

ఈ వారం మీకు దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది. బంధుమిత్రుల వియోగం బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఉద్యోగస్తులకు అదనపు భాధ్యతలుంటాయి. వారాంతమున నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

 కన్యా రాశి: 

 ఈ వారం మీరు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తి కరంగా ఉంటుంది. బంధుమిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగుల కష్టం ఫలించి అవకాశాలు లభిస్తాయి. వారాంతంలో బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీరు ల్యాండ్ అమ్మకాల్లో  అధిక లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ విషయమై ప్రతిబంధకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆప్తులతో మాటపట్టింపులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధన పరంగా ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి: 

ఈ వారం మీరు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవమర్యాదలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి లాభాల అందుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారాంతమున బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ధనవ్యయం సూచనలు ఉన్నవి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

 ఈ వారం మీరు  విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలు లాభాల బాట పడతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

 ఈ వారం మీరు బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ వేగవంతం చేస్తారు. వ్యాపార విషయంలో తెలివిగా వ్యవహరించి మంచి లాభాలను అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. కొన్ని రంగాల వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారం మధ్యలో ధన పరంగా ఇతరులతో మాట్లాడటం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి: 

 ఈ వారం మీకు మీ పిల్లల విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీర్ఘ కాలిక ఋణ బాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

 ఈ వారం మీకు బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి లభిస్తుంది. చిన్నతరహా పరిశ్రమల వారు విశేషమైన ఆదరణ పొందుతారు. వారం మధ్యలో కొన్ని పనులు నిలిచిపోతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తప్పవు. ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×