ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (మే 10 – మే 16) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీకు సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది. ముఖ్య విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. గృహ నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు తప్పవు. చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశములు అందుతాయి.
ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించిన నిదానంగా మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వారం ప్రారంభంలో ధన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులంటాయి.
ఈ వారం మీకు ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సమయస్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో చిన్నపాటి విబేధాలుంటాయి.
ఈ వారం మీరు ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.
ఈ వారం మీరు నూతన రుణాల కోసం ప్రయత్నిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు. వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. పాత ఋణాలు కొంత వరకు తొలగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు.
ఈ వారం మీకు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.
ఈ వారం మీ ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ నాయకులకు కలసి వస్తుంది. వారం చివరిలో చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలుంటాయి.
ఈ వారం మీకు సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అందరిని మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి. బందువులతో వివాదాలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. చిన్నతరహా ప్రయత్నాలు సఫలమౌతాయి.
ఈ వారం మీరు చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు అమలు పరుస్తారు. గృహ వాహన కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతన విధులు ఉత్సాహాన్నిస్తాయి. వారం ప్రారంభంలో కొన్ని పనులు వ్యయప్రయాసలతో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
ఈ వారం మీరు చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధు మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు అదిగమించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో కలహా సూచనలున్నవి.
ఈ వారం మీకు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు అందుకుంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదులుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.