E-Paper
Advertisement

దెయ్యాల కోసం వెళ్తే వణికించే శవం… డిటెక్టివ్‌కి నిద్ర లేకుండా చేసిన ఆ భయంకరమైన రాత్రి

దెయ్యాల కోసం వెళ్తే వణికించే శవం… డిటెక్టివ్‌కి నిద్ర లేకుండా చేసిన ఆ భయంకరమైన రాత్రి
Advertisement

Crime Thriller Movie on OTT : దెయ్యాలు, దేవుళ్ళు అనే విషయాలను చాలామంది నమ్ముతారు. అలాగే ఎంతోమంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా దెయ్యాలు కన్పిస్తే, అవి కళ్ళముందే కదలాడుతూ ఒక్కొక్కరినీ భయంకరంగా హత్య చేస్తే ? తనను చంపిన వాళ్లపై ఓ ఆత్మ ఎలా పగ తీర్చుకుంది ? అన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ తో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ హారర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? మూవీ కథేంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

అద్భుతమైన సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ A Haunting in Venice (2023). అగాథా క్రిస్టీ రాసిన ‘Hallowe’en Party’ నవల ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ప్రముఖ డిటెక్టివ్ హెర్క్యులే పోయిరోట్ (కెన్నెత్ బ్రానాగ్) రిటైర్మెంట్ తరువాత, ఒక భయంకరమైన మిస్టరీని ఎలా ఛేదించాడనే కథే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ప్రస్తుతం JioHotstar లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కు హారర్ ఎలిమెంట్స్ కూడా కలిపి అద్భుతంగా తెరకెక్కించారు. వెనిస్ నగరపు చీకటి సందులు, పాత కాలపు భవనాలు ఈ సినిమాలో స్పెషల్ థ్రిల్ ను ఇస్తాయి. అగాథా క్రిస్టీ రాసిన ‘Murder on the Orient Express’ లేదా ‘Death on the Nile’ సినిమాలను చూసిన వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే హారర్ జానర్ ను ఇష్టపడే వాళ్ళు కూడా డోంట్ మిస్.

కథలోకి వెళ్తే…

Advertisement

ప్రముఖ హెర్క్యులే పోయిరోట్ ఇందులో హీరో క్యారెక్టర్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు. వెనిస్ నగరంలో ప్రశాంతంగా బతుకుతాడు. అయితే పాత స్నేహితురాలు, రచయిత్రి అరియాడ్నే ఆలివర్ ఎంట్రీ ఇచ్చి అతని జీవితాన్ని మార్చేస్తుంది. అతన్ని ఒక ‘సెయాన్స్’ అనే ఆత్మలతో మాట్లాడే కార్యక్రమానికి ఆహ్వానిస్తుంది. ఈ తతంగం అంతా ఒక పాత భవనంలో షురూ అవుతుంది. కానీ ఆ భవనానికి ఒక భయంకరమైన స్టోరీ ఉంటుంది. గతంలో చాలా మంది పిల్లలు అక్కడ చనిపోయారని, వారి ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయని అందరూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ భవన యజమాని తన చనిపోయిన కూతురు ఆత్మతో మాట్లాడాలని ఇప్పుడు ఈ దెయ్యలతో మాట్లాడే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది.

ఆత్మలతో మాట్లాడే మహిళ సెయాన్స్ జరుగుతున్న సమయంలోనే సడన్ గా హత్యకు గురవుతుంది. బయటేమో భయంకరమైన తుఫాను, ఇంట్లో ఊహించని మర్డర్ తో వణికిపోయే వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆత్మలను ఏమాత్రం నమ్మని పోయిరోట్, ఇది మనిషి చేసిన హత్యే అని బలంగా నమ్ముతాడు. అయితే ఆ భవనంలో వస్తున్న వింత శబ్దాలు, కంటికి కనిపించని ఆకృతులు అతనికి కూడా కన్పించడంతో గందరగోళం ఏర్పడుతుంది.

Advertisement

ఈ క్రమంలోనే పోయిరోట్ తన తెలివితేటలకు పని చెపుతాడు. ఆ భవనంలోని ప్రతి ఒక్కరిని తనదైన స్టైల్ లో విచారిస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆ భవన యజమాని కూతురు గతంలో ఎలా చనిపోయింది ? ఆ హత్యకు, ఇప్పుడు జరిగిన హత్యకు ఉన్న లింక్ ఏంటి ? అనే విషయాలను కూడా కనిపెడతాడు. మనుషులు ఆత్మల పేరుతో తమ పాపాలను ఎలా కప్పిపుచ్చుకుంటారో ఆధారాలతో సహా అతను ప్రూవ్ చేస్తాడు. మరి నిజంగానే అక్కడ దెయ్యాలు ఉన్నాయా? అంతమంది మనుషులు ఉండగా ఆ మహిళను ఎవరు, ఎలా హత్య చేశారు ? అన్నది ఈ సినిమా ఇంట్రస్టింగ్ క్లైమాక్స్.

Read Also : రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేసిన ‘సైకలాజికల్ మాస్టర్ పీస్’.. ఈ సినిమా వేరే లెవెల్..

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×