E-Paper
Advertisement

Friday: శుక్రవారం పుట్టారా..? అయితే మీకు భవిష్యత్తులో అదే జరుగుతుందట

Friday: శుక్రవారం పుట్టారా..? అయితే మీకు భవిష్యత్తులో అదే జరుగుతుందట
Advertisement

Friday: శుక్రవారం పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా..? వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..? శుక్రవారం పుట్టిన వారు ఏ రంగంలో రాణిస్తారు. ఏ పనులు చేస్తే వీరికి కలిసి వస్తుంది.. వీరికి అదృష్టం ఎప్పుడు వరిస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం మరియు సంఖ్యా శాస్త్రం ప్రకారం, వారాంతానికి ముందు వచ్చే శుక్రవారం పుట్టిన వారిపై శుక్ర గ్రహం (Venus) ప్రభావం అధికంగా ఉంటుందని నమ్ముతారు. శుక్రుడు అంటేనే అందం, సంపద, కళలు మరియు ఆనందానికి ప్రతీక. అందుకే ఈ రోజున పుట్టిన వారి జీవితం మరియు భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: శుక్రవారం పుట్టిన వారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని అందమైన రూపాన్ని కలిగి ఉంటారట. వీళ్లు అందంగా కనిపించడానికి, విలాసవంతమైన జీవితానికి ఎక్కువ  ప్రాధాన్యత ఇస్తారట. వీరిది కళా హృదయం అంటే వీరికి సంగీతం, సాహిత్యం, నటన లేదా చిత్రలేఖనం వంటి ఏదైనా కళా రంగం పట్ల అమితమైన ఆసక్తి ఉంటుందట. అయితే వీరు చాలా శాంత స్వరూపులు వీరు గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. శాంతియుతమైన వాతావరణాన్ని ఇష్టపడతారు. అలాగే అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ప్రయత్నిస్తారట.

కెరీర్ మరియు భవిష్యత్తు: శుక్రవారం పుట్టిన వారు ఎక్కువగా సృజనాత్మక రంగాల్లో రాణిస్తారట. వీరు డిజైనింగ్, ఫ్యాషన్, సినిమా, హోటల్ మేనేజ్‌మెంట్, జ్యువెలరీ బిజినెస్ మోడలింగ్‌ సంబంధిత రంగాలలో అద్భుతంగా రాణిస్తారట. శుక్రవారం పుట్టిన వారు ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉంటారట. సంపాదన కంటే ఖర్చు చేసే విషయంలో వీళ్లు కొంచెం కూడా వెనకాడరట. అందుకే శుక్రవారం పుట్టిన వాళ్లు  పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం పుట్టిన వాళ్లు కొత్త కొత్త  ఆలోచనలతో వ్యాపారంలో బాగా ఎదగుతారట.

Advertisement

కుటుంబం మరియు సంబంధాలు: శుక్రవారం పుట్టిన వారు తమ కుటుంబ సభ్యుల పట్ల, భాగస్వామి పట్ల చాలా ప్రేమానురాగాలను కలిగి ఉంటారట.  ఇతరుల కష్టాల్లో పాలు పంచుకునే గుణం వీరి సొంతమట. వీరికి సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయట. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుందట.

జాగ్రత్త పడాల్సిన విషయాలు: శుక్రవారం పుట్టిన జాతకులు కూడా కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. విలాసాల పట్ల వ్యామోహం తగ్గించుకోవాలట. వీరు కొన్నిసార్లు అవసరం లేకపోయినా విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారట. అది తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే శుక్రవారం పుట్టిన వాళ్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారట. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా కూల్‌ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ధన, ధాన్య ఐశ్వర్యాల కోసం ఉగాది రోజు ఆ దానం చేయాలట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×