Iran War: యుద్ధం కీలక దశకు చేరుకున్న సమయంలో.. ఇరాన్ దూకుడు చూపిస్తుంటే, అమెరికా డిఫెన్స్‌లో పడింది. రణరంగంలో వ్యూహాలు నిమిషానికోసారి మారిపోతుంటాయ్. యుద్ధతంత్రం కూడా ఊహించని విధంగా మారిపోతుంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. యుద్ధం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మొదలైనప్పుడు, ప్రపంచమంతా అమెరికా అండతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతుందని భావించింది. వారం లోపే యుద్ధంలో ఇరాన్ చేతులెత్తేస్తుందని అనుకున్నారు. కానీ, గడిచిన నాలుగు వారాల్లో సీన్ రివర్స్ అయింది. అగ్రరాజ్యం అమెరికానే ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తుంటే. ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటూ యుద్ధ భూమిలో కాలు దువ్వుతోంది. ఇరాన్ చూపిస్తున్న ఈ అసాధారణ ధైర్యాన్ని చూసి.. ప్రపంచ దేశాలన్నీ అవాక్కవుతున్నాయ్.
ఇరాన్‌ని లొంగదీసుకుంటామని ప్రగల్భాలు పలికిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. ఓ అడుగు వెనక్కేసారు. చర్చలు జరుగుతున్నాయని, ఐదు రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నామని ప్రకటించారు. అయితే, ఇరాన్ మాత్రం.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా.. తమకూ, అమెరికాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, తాము చర్చలకు కూడా సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఏదేమైనా.. ఈ యుద్ధం విషయంలో అగ్రరాజ్యం వెనక్కి తగ్గిందనేది మాత్రం వాస్తవం. ఇరాన్‌పై సైనికచర్యకు పాల్పడినప్పుడు అమెరికా-ఇజ్రాయెల్‌కు స్పష్టమైన లక్ష్యం లేదు. అయతుల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ప్రభుత్వాన్ని పడగొడతామని ఓసారి, ఇరాన్ అణ్వాయుధాలను తయారుచేయకుండా చేస్తామని మరోసారి, ఇరాన్ నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని, ఆ దేశాన్ని లొంగదీసుకుంటామని ఇంకోసారి.. ఇలా పూటకో మాట చెప్పారు ట్రంప్. అవతలి వైపు ఇరాన్ మాత్రం ధైర్యాన్ని, శక్తిని కూడగట్టుకొని.. యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. తమ దేశ సమగ్రతను కాపాడుకునే ఏకైక, స్పష్టమైన లక్ష్యంతో ఇరాన్ పోరాడుతూనే ఉంది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ తన డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెల్, అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ వారి డిఫెన్స్ స్టాక్‌ను ఖాళీ చేస్తోంది. ఎన్ని రకాలుగా దాడి చేసినా, ఎన్ని చోట్ల బాంబులేసి విధ్వంసం సృష్టించనా.. ఇరాన్ తన స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోవడం లేదు. అందుకే, అమెరికా ఇప్పుడు చర్చల వైపు మొగ్గు చూపుతోంది. ఇందుకు మెయిన్ రీజన్.. హర్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు వ్యాపారానికి కీలకమైన హర్మూజ్ ఇరాన్ కంట్రోల్‌లో ఉంది. యుద్ధం ఇంకా ముదిరితే ప్రపంచ దేశాల్లో సంక్షోభం పెరిగిపోయే ప్రమాదముంది. హర్మూజ్‌పై నియంత్రణ తెచ్చుకోలేక, అమెరికా ఆపసోపాలు పడుతోంది. చమురు సప్లై ఆగిపోతే.. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయ్. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది. అందువల్లే.. అమెరికా యుద్ధం వద్దనే దాకా వచ్చేసింది.
Also Read: Sub Sea Cables: ఇరాన్ యుద్ధంతో ఇంటర్నెట్ కు తంటా.. హూతీల టార్గెట్ సబ్ సీ కేబుళ్లు!
వాస్తవానికి ఒకప్పటి ఇరాన్ వేరు.. ఇప్పుడున్న ఇరాన్ వేరు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా-ఇరాన్ బంధం బలపడింది. ఇరాన్ నుంచి డ్రోన్లు తీసుకుంటున్న రష్యా.. బదులుగా అధునాతన యుద్ధ విమానాలను, టెక్నాలజీని ఇరాన్‌కు అందిస్తోంది. మరోవైపు.. చైనా ఇరాన్ నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తూ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూస్తోంది. దాంతో ఇరాన్ ఎంత బలంగా ఉండాలో అంత బలంగా ఉంది. అయితే, ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం.. ఇరాన్‌ని తక్కువ అంచనా వేశారు. వెనెజుయెలా ప్రెసిడెంట్ మదురో అధికారిక నివాసంపై దాడి చేసి రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చిన ట్రంప్.. ఇరాన్‌పైనా సేమ్ ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. సైనిక, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన తరుణంలో.. అకస్మాత్తుగా బాంబులు వేశారు. మొత్తానికి.. అలీ ఖమేనీని అంతం చేశారు. దాంతో సీన్ మారుతుందనుకున్నారు. అయితే.. సీన్ మారింది. కానీ, అమెరికా, ఇజ్రాయెల్ అనుకున్నట్లు కాదు. అప్పటిదాకా ఉన్న అంతర్గత విభేదాలు, అలీ ఖమేనీ పాలనపై ఉన్న అసమ్మతిని కూడా పక్కనపెట్టి.. దేశ రక్షణ కోసం ఇరాన్ మొత్తం ఒక్కటైంది. ఆ దేశంలోనీ ప్రతీ పట్టణంలో మిసైళ్లు, బాంబులు పడుతున్నా.. బెదరకుండా, రోడ్లమీదికి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ ర్యాలీలు తీశారు. ఇది.. ఇప్పటికీ కొనసాగుతోంది.
పశ్చిమాసియా యుద్ధ క్షేత్రంలో ఈక్వేషన్స్ వేగంగా మారిపోతున్నాయ్. అత్యాధునిక టెక్నాలజీ, అజేయమైన ఎయిర్‌ఫోర్స్ ఉన్న.. ఇజ్రాయెల్-అమెరికా కూటమిని ఇరాన్ ఒంటరిగా ఎదుర్కొంటోంది. ఏమాత్రం పట్టు సడలించడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్న తరుణంలో.. ఇరాన్ ఎందుకింత ధీమాగా ఉందనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయినా, యుద్ధం అంటే ఈజీ కాదు. దానిని మొదలుపెట్టడం సులభమే అయినా, ముగించడమే అనేక సవాళ్లతో ముడిపడి ఉంటుంది. ఇరాన్ బలాబలాలేమిటనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయకుండానే.. ట్రంప్ యుద్ధంలోకి దిగారు. ఇజ్రాయెల్‌ని గుడ్డిగా నమ్మి.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.
Also Read: VV Vinayak: ఒకప్పుడు మాస్ డైరెక్టర్… ఇప్పుడు ఛాన్స్ కోసం వెయిట్?
ఇరాన్.. ఈ యుద్ధాన్ని గల్ఫ్ మొత్తానికి విస్తరిస్తుందని ట్రంప్, నెతన్యాహు అస్సలు ఊహించలేదు. ఇక, హర్మూజ్ జలసంధిని అడ్డుకోవడం ద్వారా.. ఇరాన్ తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. దాంతో.. యుద్ధం ప్రభావం మొత్తం ప్రపంచం మీద పడింది. దాంతో అమెరికాపై ప్రెజర్ పెరుగుతోంది. ఇరాన్‌ని చర్చలకు రమ్మనడం వెనుక శఆంతి కాంక్ష కంటే, స్వలాభమే ఎక్కువ కనిపిస్తోంది. మరోవైపు.. ఇరాన్ తన పంతాన్ని వీడకపోవడానికి బలమైన కారణాలున్నాయ్. ఇప్పుడు గనక యుద్ధంలో వెనక్కి తగ్గితే.. పశ్చిమాసియాలో తమ పట్టు కోల్పోతామని ఆ దేశం భావిస్తోంది. అందుకే.. చర్చలకు రాకుండా అమెరికాని మరింత ఇరకాటంలో పడేసింది. యుద్ధం సుదీర్ఘంగా సాగితే దేశాల ఆర్థిక వ్యవస్థలు, రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయ్. అన్ని వైపుల నుంచి అమెరికాపై పెరుగుతున్న ఒత్తిడి కూడా.. ఇరాన్‌కు అనుకూలంగా మారింది. చైనా, రష్యా నుంచి అందుతున్న పరోక్ష మద్దతు కూడా ఇరాన్‌కు కొండంత ధైర్యాన్నిస్తోంది.
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి.. ఇరాన్ నియంత్రణలో ఉంది. ఒకవేళ యుద్ధం ముదిరితే, ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బతీసే అవకాశం ఉంది. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగితే, ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఒత్తిడి తెస్తాయని ఇరాన్ నమ్ముతోంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, ఇరాన్ తన సొంత డ్రోన్, మిసైల్ టెక్నాలజీని విపరీతంగా అభివృద్ధి చేసుకుంది. చౌకగా తయారయ్యే సూసైడ్ డ్రోన్లు కూడా ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ముప్పుతిప్పలు పెడుతున్నాయ్. అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన దానిపై ఇరాన్ 100 మిసైళ్లను ప్రయోగించిందని ట్రంప్ ప్రకటించారు. అయితే, వాటన్నింటిని కూల్చేశామని ట్రంప్ తెలిపారు. అయితే, అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్‌పై దాడి చేసింది తామేనని ఇరాన్ ప్రకటించింది. యుద్ధంలోఇదొక అనూహ్య పరిణామం. ఆ యుద్ధ నౌకను టార్గెట్ చేస్తున్నామని హెచ్చరించిన గంటలోపే దాడి చేసింది.
Storey By: Anup Big Tv
Also Read: AP Politics: అవంతీ వర్సెస్ గంటా రవితేజ.. విశాఖ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్..?