Saturday: శనివారం పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా..? శనివారం పుట్టిన వారికి ఏ రంగం కలిసి వస్తుదో తెలుసా..? అసలు శనివారం పుట్టిన వారు ఏ రంగంలో స్థిరపడతారో తెలుసా..? జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం పుట్టిన వారి భవిష్యత్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
శనివారం పుట్టిన వారు సాధారణంగా క్రమశిక్షణ, పట్టుదల మరియు గంభీర స్వభావానికి ప్రతీకలుగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ‘శని భగవానుడికి’ ప్రీతికరమైన రోజు కాబట్టి, ఆ ప్రభావం వీరి జీవితంపై స్పష్టంగా కనిపిస్తుందని పండితులు చెప్తున్నారు. శనివారం పుట్టిన వారి జీవితం, వృత్తి పరమైన అంశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యక్తిత్వం మరియు స్వభావం: శనివారం పుట్టిన వారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారట. అలాగే వీరు చాలా పద్ధతిగా ఉంటారట. ఏ పని చేసినా ఒక ప్రణాళిక ప్రకారం, బాధ్యతాయుతంగా పూర్తి చేస్తారట. ఇక శనివారం పుట్టినవారు మోసపూరితమైన మాటలు లేదా పనులకు చాలా దూరంగా ఉంటారట. వీరికి చెడు వ్యసనాలన్నా అసలు పడదట. వీరికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం వల్ల లేనిపోని కష్టాలు వస్తాయట. అయితే శనివారం పుట్టినవాళ్లు ఎంతటి కష్టాలైనా భరిస్తారట. ఎటువంటి కష్టం వచ్చినా చేపట్టిన పనులు మాత్రం ఓర్పు, సహనంతో పూర్తి చేస్తారట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీరు వెనకడుగు వేయరట.
వీరు తమ వయసు కంటే ఎక్కువ పరణతితో ఉంటారట. వీరిలో అందరికంటే ఎక్కువ తెలివితేటలు, లోకజ్ఞానం ఉంటుందట. అందుకే వీరు ఇచ్చే సలహాలకు కూడా చాలా విలువైనవి అయి ఉంటాయట. అయితే శనివారం పుట్టిన వారి జీవితం ప్రారంభంలో లేదా యవ్వనంలో కొంత సంఘర్షణ లేదా కష్టాలు రావొచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. వీరికి ఏదీ అంత సులభంగా దక్కదట. ఒక్క కష్టం తప్ప. అయితే వీరికి ముఫ్పై ఏళ్లు దాటిన తర్వాత జీవితం స్థిరమైన మార్గంలోకి వెళ్తుందట. అప్పటి వరకు పడిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుందట. కొందరికి 35 ఏళ్లు దాటిన తర్వాత స్థిరత్వం వస్తుందట. ఇక శనివారం పుట్టిన వారు ఆర్థిక విషయాల్లో చాలా పకడ్బందీగా ఉంటారట. వీరు ఎక్కువగా పొదుపు చేస్తుంటారట. అలాగే ఖర్చులు చేయకుండా ఆస్థులు కూడబెట్టడంలో వీరు సిద్దహస్తులట.
శనివారం పుట్టిన వారికి కలిసి వచ్చే రంగాలు: శనివారం పుట్టిన వారు కష్టపడే స్వభావం కలవారు కాబట్టి వారికి సాంకేతికత, ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ లేదా మైనింగ్ రంగాలు భాగా కలిసి వస్తాయట. ఈ రంగాల్లోనే వీరికి మంచి గుర్తింపు కూడా లభిస్తుందట. ఇంకా శనివారం పుట్టిన వారు లాయర్లుగా, జడ్జిలుగా లేదా పోలీస్ శాఖలో ఉన్నత పదవులను అధిరోహిస్తారట. ముఖ్యంగా శనివారం పుట్టిన వారు వ్యాపారం చేస్తే బాగా కలిసొస్తుందట. ఇనుము, చమురు (Oil), వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలైతే వీరికి బాగా కలిసి వస్తాయట. ఇంకా శనివారం పుట్టిన వారు సైంటిస్టులుగా లేదా ఏదైనా విషయాన్ని లోతుగా విశ్లేషించే పరిశోధకులుగా కూడా విజయం సాధిస్తారట. సమాజంలో మార్పు తీసుకురావాలనే తపనతో శనివారం పుట్టిన వారు రాజకీయాల్లో స్థిరపడే అవకాశం కూడా ఉంటుందట. కానీ వీరికుండే ముక్కుసూటితనం వల్ల ఎక్కువగా నష్టపోతుంటారట.
సూచనలు, సలహాలు: శనివారం పుట్టిన వారు చాలా మెల్లగా ఉంటారట. ఏ పని చేసినా బద్దకంగా ఉంటారట. ఈ బద్దకాన్ని తగ్గించుకుంటే వీరు ఎన్నో విజయాలు సొంతం చేసుకోగలరని పండితులు సూచిస్తున్నారు. ఇక శనివారం పుట్టిన వారు ప్రతి శనివారం పేదలకు సహాయం చేయడం లేదా మొక్కలు నాటడం వల్ల వీరికున్న టెన్షన్స్ తగ్గి ప్రశాంతత లభిస్తుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.