E-Paper
Advertisement

Born in May: మే నెలలో పుట్టారా..? మీకు ప్రేమ విషయంలో అదే జరుగుతుందట

Born in May: మే నెలలో పుట్టారా..? మీకు ప్రేమ విషయంలో అదే జరుగుతుందట
Advertisement

Born in May: మే నెలలో పుట్టిన వ్యక్తుల జీవితం, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా..? వారి ప్రేమ విషయంలో జరిగే పరిణాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంకా వీరి ఆర్థిక పరిస్థితులు వ్యక్తిత్వ, స్వభాలు ఎలా ఉంటాయో ఇప్పడు ఈ కథనంలో తెలుసుకుందాం.

మే నెలలో పుట్టిన వారు సాధారణంగా చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని, బలమైన సంకల్పాన్ని కలిగి ఉంటారట. మే నెలపై వృషభం (Taurus) మరియు మిథున (Gemini) రాశుల ప్రభావం ఉంటుందట. సంఖ్యా శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరి జీవితం ఎలా ఉంటుందో .. వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో.. వీరికి ఆర్థిక పరమైన విషయాలు ఎలా ఉంటాయో.. ముఖ్యంగా ప్రేమ విషయంలో వీరి జీవితంలో జరిగే పరిణామాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: మే నెలలో పుట్టిన వారికి మొండితనం ఎక్కువగా ఉంటుందట. అలాగే పట్టుదల కూడా వీరికి ఎక్కువేనట. వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరట. వీరిలో ఎక్కువగా ఉన్న పట్టుదల కొన్నిసార్లు మొండితనంగా కూడా మారిపోతుందట. అయితే మే నెలలో పుట్టిన వారిది కష్టపడే తత్వమట. వీరు సోమరితనాన్ని అసలు ఇష్టపడరట. శ్రమించి పని చేయడం ద్వారానే విజయం లభిస్తుందని నమ్ముతారట. వీరికి ఆకర్షణీయమైన మాటతీరు ఉంటుందట.  వీరి మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుందని.. . నలుగురిని సులభంగా ఆకర్షించగల చాకచక్యం ఉంటుదని.. పండితులు చెప్తున్నారు. అయితే వీరిలో కోపం ఎక్కువగా ఉంటుందట. అలాగే భావోద్వేగాలు వీరికి ఎక్కువేనట. వీరికి కోపం ఎంత  త్వరగా వస్తుందో అంతే త్వరగా పోతుందట. మనసులో ఏదీ దాచుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడతారట.

కెరీర్ మరియు భవిష్యత్తు:  మే నెలలో పుట్టిన వారు కళలు, సంగీతం, డిజైనింగ్ లేదా రాయడం వంటి సృజనాత్మక రంగాల్లో అద్భుతంగా రాణిస్తారట. అలాగే వీరికి వ్యాపారం చేయడంలో మేనేజ్‌మెంట్‌ చేయడంలో ప్రావీణ్యం ఉంటుందట. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయట. పెద్ద సంస్థలను నిర్వహించడం లేదా స్వంత వ్యాపారాలు చేయడంలో వీరు విజయవంతమవుతారట. వీరు డబ్బు సంపాదించడంలో ఎంత నేర్పరులో ఖర్చు చేయడంలో కూడా అంతే ముందుంటారట. విలాసవంతమైన వస్తువుల మీద వీరికి మక్కువ ఎక్కువగానే ఉంటుందట.

Advertisement

సంబంధ బాంధవ్యాలు: మే నెలలో పుట్టిన వారు రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. తమ కుటుంబానికి, స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారట. అలాగే ఎవరికైనా మాట ఇస్తే దానిని తప్పకుండా నిలబెట్టుకుంటారట. ఇక వీరు ప్రేమ విషయంలో అతిగా ఉంటారట. దీంతో తాము ప్రేమించిన వారిని దూరం చేసుకునే పరిస్థితులు వస్తాయట. అతిగా స్పందించడం వల్లే వీరు ప్రేమలో విఫలం అవుతుంటారట. మే నెలలో పుట్టిన వారికి ప్రయాణాలన్నా  ప్రకృతి అన్నా చాలా ఇష్టమట. అయితే వీరు పని ఒత్తిడి వల్ల వచ్చే చిన్న పాటి అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు  ఎక్కడ ఉంటాయో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×