zodiac sign: పన్నెండు రాశుల్లో పుట్టిన వారు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశిలో పుట్టిన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో చెప్పవచ్చట. అలా తెలుసుకుని ముందు జాగ్రత్త పడటం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రాశిలో పుట్టిన జాతకులుకు సాధారణంగా తల, కడుపు, పైత్యం, నత్తి, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు, చర్మమునకు సంబంధించిన విచిత్రమైన అనారోగ్యాలు, జ్వరాలు కలిగే అవకాశాలు ఉంటాయి.
జాగ్రత్తలు: ధ్యానం చేస్తూ ఉండాలి, పసుపు + తేనే పరిగడుపున తీసుకోవాలి, ఆహరంలో కందిపప్పు ఎక్కువగా వుండాలి.
ఈ రాశి జాతకులకు గొంతు, హృదయం, స్వరపేటిక, మల సంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధ్యులు, కఫము, టాన్సిల్స్, ఢిప్తీరియా, పయోరియా (పళ్ళకి సంబంధించిప వ్యాధి), మూత్ర వాధ్యులు, రక్త క్షీణత, ఉబ్బు వ్యాధి లాంటివి వచ్చే అవకాశాలుంటాయి.
జాగ్రత్తలు: ధ్యానం (మెడిటేషన్), వ్యాయామాలు చేయడం మంచిది.
ఈ రాశి వారికి విశ్రాంతి లేకపోవుట, ఊపిరితిత్తులు, మనోవ్యాధి, ఆక్సీ జన్ లోపాలు, నరాల వ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెముడు, తలనొప్పి, ఉన్మాదం మొదలైనవి వచ్చే అవకాశాలు ఉంటాయి.
జాగ్రత్తలు: పౌష్ఠికాహారం తీసుకోవడం, గాలి వెలుతురు వున్న గృహ నివాసం, క్రీడలు, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అంతేకాకుండా శరీరారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే మొలకలు వచ్చిన పెసలు తినడం చాలా చాల మంచిది.
ఈ రాశిలో పుట్టిన వారికి రొమ్ము, జీర్ణకోశం, హృదయ నాళాలు, నీరు పట్టడం, నంజు కేన్సర్, హిస్టీరియా, కఫం, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక, శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు: ఎక్కువగా ఆలోచించడం మానుకోవాలి. యోగాసనాలు వేయాలి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది.
ఈ రాశిలో పుట్టిన వారికి వీపు, వెన్నెముక, హృదయం, హృదయ దౌర్బల్యం, గుండెదడ, నడుమునెప్పి, కడుపునెప్పి, పండ్లనెప్పి, ముఖ వ్యాధి, మొదలైనవి కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు: తమ మనసులోని భావాలు బహిరంగ పరచడం, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేస్తుండాలి. తమ పనులు తామే నిర్వహించుకోవాలి.
ఈ రాశి జాతకులు పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెముక క్రిందిభాగం, అజీర్ణం, విరోచనాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తలు: సమాయానికి మితాహారం తీసుకోవాలి. వ్యాయమం చేయాలి. మొలకలు వచ్చిన పెసలు తీసుకోవాలి. ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆందోళన, మూత్రపిండములకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత కలిగే అవకాశాలు ఉంటాయట.
జాగ్రత్తలు: బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. యోగా, వ్యాయామం రెగ్యులర్‌గా చేయాలి. అందరూ మీరు చెప్పినట్లే వినాలి అనే ధోరణి వదిలేయాలి.
ఈ రాశిలో పుట్టిన వారికి తొడలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, దురద, సుఖవ్యాధులు, భగందరము, హృదయమునకు సంబంధించి వ్యాధులు, కఫము మొదలైనవి కలిగే అవకాశం ఉంటుందట.
జాగ్రత్తలు: కందిపప్పు, పసుపు ఆహారంలో వాడాలి. చల్లని వాతావరణం మంచిది. ఇతరులలో తప్పు పట్టడం మాని ప్రేమానురాగాలను పెంచుకుంటూ.. తప్పు చేయని వారు లోకంలో ఉండరని గుర్తించి సర్దుకోవడం అవసరం.
ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, గాయాలు, రక్తదోషము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం మొదలైనవి కలిగే అవకాశం ఉంటుందట.
జాగ్రత్తలు: వ్యాయామం, ప్రాణాయామం చేస్తుండాలి. తగిన మోతాదులో ఆహరం తీసుకోవాలి. మొలకలొచ్చిన శనగలు రెగ్యులర్ గా తింటుండాలి. ఎక్కువ బాధ్యతలు తీసుకోకుండా ఉండాలి.
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులు, జలుబు, ఉదర రోగాలు, వాత సంబంధ అనారోగ్యాలు, మల, మూత్ర వ్యాధులు, చలి, చెవుడు, వెన్నెముక వ్యాధి, కాన్సర్, పక్షవాతం లాంటి వ్యాదులు వచ్చే అవకాశం ఉంటుందట.
జాగ్రత్తలు: వంటికి నువ్వుల నూనె పట్టించుకోవటం, నువ్వుల పొడి ఆహారంలో వాడకం, ప్రాణయామం, సూర్య నమస్కారాలు చేస్తుండాలి.
ఈ రాశిలో పుట్టిన వారికి నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసార దోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు లాంటి మొదలైన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందట.
జాగ్రత్తలు: మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్, ఆహారంలో నువ్వులపొడి వాడటం లాంటివి చేస్తుండాలి. సూర్య నమస్కారాలు చెయ్యటం. ప్రతి పనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.
ఈ రాశి జాతకులకు భావోద్రేకం, బలహీనత, కీళ్ళ జబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం. మద్యపానం వల్ల వచ్చే అనారోగ్యం. కణతులు, మలకోశం మొదలైన వాటికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుందట.
జాగ్రత్తలు: మొలకలు వచ్చిన శనగలు తీసుకోవాలి. పసుపు ఆహారంలో భాగం చేసుకోవాలి. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.