E-Paper
Advertisement

deity at home: ఇంట్లో దేవుడి ముందు దీపం ఎవరు వెలిగించాలి..? భార్యనా..? భర్తనా..?

deity at home: ఇంట్లో దేవుడి ముందు దీపం ఎవరు వెలిగించాలి..? భార్యనా..? భర్తనా..?
Advertisement

deity at home: ఇంట్లో దేవుడి ముందు దీపం ఎవరు వెలిగించాలి. ఇంట్లో ఉండే భార్య వెలిగించాలా..? లేదంటే భర్త వెలిగించాలా… ఎవరు వెలిగిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది..? భార్య వెలిగిస్తే మంచిదేనా..? లేక భర్త వెలిగిస్తే మంచిదా..? ఈ కన్పీజన్‌ పోవాలంటే ఈ కథనం మొత్తం చదవాల్సిందే..

సాధారణంగా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఇంట్లో దీపం వెలిగించడం అనేది అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారట.  ఇంట్లో దీపం వెలిగించడానికి హింద ధర్మశాస్త్రాల్లో కొన్ని నియమాలు ఉన్నాయని చెప్తున్నారు పండితులు. ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గృహలక్ష్మిగా భార్య ప్రాధాన్యత: మన సంప్రదాయంలో స్త్రీని  గృహలక్ష్మి  అని పిలుస్తారు. ఇంట్లో వెలిగించే దీపం ఆ ఇంటి ఐశ్వర్యానికి, ప్రశాంతతకు చిహ్నం. అందుకే సాధారణంగా భార్య (స్త్రీ) దీపం వెలిగించడం శుభప్రదమని నమ్ముతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఇల్లాలి చేతితో దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.

భర్త ఎప్పుడు వెలిగించవచ్చు: శాస్త్రం ప్రకారం పూజ చేసే అధికారం స్త్రీ పురుషులిద్దరికీ సమానంగా ఉంటుందట. కానీ  భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా పీరియడ్స్ (నెలసరి) సమయంలో ఉన్నప్పుడు భర్త తప్పనిసరిగా దీపం వెలిగించి పూజ చేయాలట.  ఇంకా భార్య ఊరిలో లేకపోయినా లేదా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నా, భర్త నిర్మలమైన మనస్సుతో దీపం వెలిగించవచ్చట. దీనివల్ల ఎటువంటి దోషం ఉండదట.

Advertisement

భార్య భర్తలు ఇద్దరూ కలిసి వెలిగించవచ్చా?: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపం వెలిగించడం లేదా కలిసి పూజలో పాల్గొనడం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుందట. దీనిని దంపతీ పూజగా పరిగణిస్తారట.. ఇది కుటుంబ బంధాన్ని బలపరుస్తుందట.

ఎవరు వెలిగించినా పాటించాల్సిన నియమాలు: దీపం ఎవరు వెలిగించినా కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. దీపం వెలిగించే ముందు స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలట.. అలాగే దీపం ఎప్పుడూ తూర్పు వైపు (సూర్యుడి దిశ) లేదా ఉత్తర వైపు (కుబేర దిశ) ముఖం వైపు ఉండేలా చూసుకోవాలట.  దీపంలో రెండు వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వెలిగించడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట. దీపం నేరుగా నేల మీద పెట్టకుండా, ఒక చిన్న పళ్లెంలో లేదా పిండి ప్రమిదలో ఉంచడం మంచిదట.

ఇక దీపం ఎవరు వెలిగించారనే దానికంటే  ఎంత భక్తితో వెలిగించారనేదే ముఖ్యమని. భార్య వెలిగించినా, భర్త వెలిగించినా ఆ ఇంట్లో దైవ కటాక్షం తప్పక ఉంటుందని. అయితే, గృహస్తులుగా ఇద్దరూ కలిసి సంప్రదాయాన్ని గౌరవిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆ ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుందని పండితులు చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మొబైల్ నెంబర్ లో ఆ నెంబర్స్ ఉంటే అష్ట దరిద్రాలు మీ వెంటే  ఉంటాయట…?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×