E-Paper
Advertisement

Kushmanda lamp: కూష్మాండ దీపం పెడితే రాజయోగం పడుతుందా..? అసలు శాస్త్రం ఎం చెప్తుంది

Kushmanda lamp: కూష్మాండ దీపం పెడితే రాజయోగం పడుతుందా..? అసలు శాస్త్రం ఎం చెప్తుంది

Kushmanda lamp: కుష్మాండ దీపం పెడితే రాజయోగం పడుతుందా..? అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. తిండికి టికానా లేనోడు కూడా కోట్లకు పడగలెత్తుతాడా..? కొన్ని  ప్రత్యేక రోజులలో ఈ దీపం వెలిగిస్తే ఎంతటి దరిద్రుడికైనా రాజయోగం పడుతుందా..? అసలు కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి. వెలిగిస్తే నిజంగానే మంచి జరుగుతుందా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పరిహారశాస్త్రంలో కూష్మాండ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనుషులు జాతక రీత్యా ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కూష్మాండ దీపం పరిహారం చూపిస్తుందని పరిహారశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలాంటి కూష్మాండ దీపం వెలిగించడం వల్ల రాజకీయ, సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరతాయని పండితులు చెప్తున్నారు. అయితే కూష్మాండ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కూష్మాండ దీపారాధన – విధానం:

ఈ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చెయ్యాలి. ఇందుకోసం ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగ చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పేట్టి  అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులు రెండు వేసి దీపం వెలిగించాలి . ఆ దీపానికి  పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 2 సార్లు పారాయణ చేయాలి టైం ఉన్నవాళ్లు ఎనిమిది సార్లు పారాయణ చేసుకోవచ్చు. అలాగే 21 సార్లు, లేదా 54 సార్లు, 108 సార్లు కూడా పారాయణ చేసుకోవచ్చు. ప్రసాదంగా ఖర్జూరం సమర్పించడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందట. ఈ కూష్మాండ దీపం వీలైతే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందట. ఇది ఇంట్లో చేసుకునే విధానం. ఇక ఆరోజంతా ఉపవాసము ఉండాలని, ఉపవాసం ఉండలేని వాళ్లు ద్రవ పదార్థం ఏదైనా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే గుమ్మడి కాయను ఇంట్లోకి తీసుకురావడానకి ముందే రెండుగా కోసుకుని తీసుకురావాలట. ఇంట్లో ఎప్పుడూ బూడిద గుమ్మడి కాయ కోయకూడదట.

అష్టమి రోజు కూష్మాండ దీప ఫలితం:

జీవితంలో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నవారు.. ఎంత సంపాదించిన డబ్బు నిలవక ఇబ్బందులు పడుతున్న వారు. అన్ని రకాల ధన సమస్యలకు కూష్మాండ దీపాన్ని అష్టమి రోజు వెలిగించాలని సూచిస్తున్నారు. ఇలా 19 అష్టములు ఈ దీపారధన చేయడం వల్ల అర్థిక బాధలన్నీ తొలగిపోతాయని పరిహారశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

అమావాస్య రోజు కూష్మాండ దీప ఫలితం:

రాజకీయంగా ఎదగాలి అనుకునేవాళ్లు, సోసైటీలో పలుకుబడి కలిగిన వ్యక్తులుగా చలామణి అవ్వాలనుకున్న వాళ్లు మొత్తంగా చూస్తే.. జనాకర్షణ విపరీతంగా కలగడానికి అమావాస్య రోజు కూష్మాండ దీపం వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. జనార్షన కలగడం అంటే రాజకీయంగో ఏదో ఒక పదవి రావడమనే అర్థం అంటూ అది కూడా రాజయోగం కిందకే వస్తుందని పండితులు చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఇప్పుడు వచ్చిన ఈ ఫిబ్రవరి నెల మళ్ళీ 800 ఏండ్లకే వస్తుందా..? అసలు నిజం ఏంటి..?

 

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×