E-Paper
Advertisement

Bharat Taxi: భారత్ ట్యాక్సీ లాంచ్.. ఓలా, ఉబర్ దోపిడికి చెక్.. 30% తక్కువ ఖర్చుతో ప్రయాణం!

Bharat Taxi: భారత్ ట్యాక్సీ లాంచ్.. ఓలా, ఉబర్ దోపిడికి చెక్.. 30% తక్కువ ఖర్చుతో ప్రయాణం!
Advertisement

Bharat Taxi: భారతీయులకు తక్కువ ధరకే క్యాబ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ (Bharat Taxi) సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. దిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ప్రారంభించారు. భారత్ ట్యాక్సీ యాప్.. డైవర్లను, ప్రయాణికులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పరస్పర ప్రయోజనకరంగా రైడ్స్ ను అందిస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా స్పష్టం చేశారు. ఇంతకీ భారత్ ట్యాక్సీ ఎలా పనిచేస్తుంది? డ్రైవర్లు, ప్రయాణికులకు కలిగే లాభం ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

భారత్ టాక్సీ ఎలా పని చేస్తుంది?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓలా (Ola), ఉబర్ (Uber), ర్యాపిడో (Rapido) వంటి సంస్థలు.. క్యాబ్ డ్రైవర్లు, ప్రయాణికులను ఒకే ఫ్లాట్ ఫామ్ మీదకు తీసుకొచ్చి కమిషన్ రూపంలో పెద్ద మెుత్తంలో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి చెక్ పెట్టేలా భారత్ ట్యాక్సీ యాప్ అందుబాటులోకి వచ్చింది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండానే ప్రయాణికులను వారితో అనుసంధానం చేస్తుంది. భారత్ ట్యాక్సీలో క్యాబ్ డ్రైవర్లు.. ఉద్యోగులుగా కాకుండా యజమానులుగా కొనసాగుతారు.

ప్రతీ డ్రైవర్ సారథి

Advertisement

భారత్ ట్యాక్సీ అనేది సాంప్రదాయ ప్రైవేటు ఫ్లాట్ ఫామ్ గా కాకుండా సహకార సంస్థగా కొనసాగనుంది. కేంద్రమే ఈ సేవలను ప్రారంభించినప్పటికీ.. ప్రభుత్వం దీనిని స్వయంగా నిర్వహించదు. ‘సహకార ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ భారత్ ట్యాక్సీ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. భారత్ ట్యాక్సీలో ప్రతీ డ్రైవర్ సారథిగా గుర్తింపు పొందుతారు. ‘సారథి హి మాలిక్’ అనే సూత్రంతో నడిచే ఈ సంస్థలో చేరే డ్రైవర్లు.. ఐదు షేర్లను కొనుగోలు చేయడం ద్వారా యజమానులుగా మారతారు. భారత్ ట్యాక్సీ సేవలను వినియోగించుకున్నందుకు గాను రోజుకు రూ.30 స్థిర రుసుమును డ్రైవర్లు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Railyway Station In India: మిస్టరీ రైల్వే స్టేషన్.. ఆ స్టేషన్ గుండా వెళ్లే రైళ్లలో.. అకస్మాత్తుగా ఆరిపోతున్న లైట్లు!

ప్రయాణికులకు ఏంటీ ప్రయోజనం!

Advertisement

ఓలా, ఉబర్, ర్యాపిడోలో  రైడ్ ను బుక్ చేసుకుంటే ఆయా యాప్ లకు సంబంధించి కొంత కమిషన్ ప్రయాణికుడే చెల్లిస్తే మరికొంత డ్రైవర్ నుంచి వెళ్తుందని ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఛార్జీకి ఈ కమిషన్ కూడా తోడు కావడంతో కొద్ది దూరానికే ఎక్కువ మెుత్తం చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే భారత్ ట్యాక్సీలో జీరో కమిషన్ విధానం ఉండటం వల్ల ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం ఉండదు. డ్రైవర్లకు సైతం కమిషన్ ఒత్తిడి లేనందువల్ల సాధారణ ఛార్జీలతోనే వారు రైడ్ సేవలను కొనసాగిస్తారు. ఫలితంగా ప్రైవేటు అగ్రిగేటర్లతో పోలిస్తే 30 శాతం తక్కువ ఖర్చుతో భారత్ ట్యాక్సీ ద్వారా ప్రయాణించవచ్చని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Honda Dio 125 X Edition: హోండా డియో 125 X ఎడిషన్ విడుదల, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×