E-Paper
Advertisement

Fact Check: ఇప్పుడు వచ్చిన ఈ ఫిబ్రవరి నెల మళ్ళీ 800 ఏండ్లకే వస్తుందా..? అసలు నిజం ఏంటి..?

Fact Check: ఇప్పుడు వచ్చిన ఈ ఫిబ్రవరి నెల మళ్ళీ 800 ఏండ్లకే వస్తుందా..? అసలు నిజం ఏంటి..?
Advertisement

Fact Check: ఈ ఫిబ్రవరి నిజంగానే అంత స్పెషలా..? 8 వందల ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ఫిబ్రవరి వస్తుందా..? ఈ మధ్యలో ఇలాంటి ఫిబ్రవరిని చూడలేమా..? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ విషయం ఎంత వరకు నిజమనుకోవాలి. అసలు ఈ ఫిబ్రవరికి ఉన్న స్పెషలేంటి..? లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

క్యాలెండర్ లో ప్రతి సంవత్సరం నెలలు వస్తూంటాయి.. పోతుంటాయి. కానీ కొన్ని నెలలే అందులో స్పెషల్‌గా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలోనే లీఫ్‌ సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి నెల అలాగే ఒకే నెలలో వరుసగా ఐదు ఆదివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు వచ్చిన నెలలు కూడా అప్పుడప్పుడు జనం మధ్య చర్చనీయాంశంగా మారుతుంటాయి. అలాగే కొన్ని నెలల్లో వచ్చే అరుదైన గ్రహాల కలయిక లేదా అతిథుల్లా పలకరించే తోకచుక్కలు.. లాంటివి కూడా అట్రాక్షన్‌ అవుతుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది. ప్రసుతం ఈ సంవత్సర 2026లో వచ్చిన ఫిబ్రవరి నెల. అయితే ఇలాంటి నెల మళ్లీ 800 సంవత్సరాల వరకు రాదని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తల్లో ఎంత వరకు నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్‌ మీడియా ప్రచారం:

Advertisement

సోషల్‌ మీడియాలో ఈ సంవత్సరం (2026) చాలా అరుదైనది అని.. ఈ నెలలో మొత్తం నాలుగు ఆదివారాలు, నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు బుధవారాలు, నాలుగు గురువారాలు, నాలుగు శుక్రవారాలు, నాలుగు శనివారాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. అలాగే  మళ్లీ ఇలాంటి ఫిబ్రవరి నెలను చూడాలంటే మరో 800 సంవత్సరాలు పడుతుందని ప్రచారం జరుగుతుంది.

అసలు నిజం ఏంటి..?

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న  ప్రచారంలో నిజం లేదు. ఎందుకంటే ప్రతి నాన్‌ లీఫ్‌ సంవత్సరంలో అంటే లీఫ్ సంవత్సరం కాకుండా వచ్చే మూడు సంవత్సరాల క్యాలెండర్‌లో ఫిబ్రవరి నెలలో అన్ని వారాలు నాలుగు మాత్రమే ఉంటాయి. అదే లీఫ్‌ సంవత్సరం అయితే ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి కాబట్టి అందులో ఏదో ఒక వారం ఒకటి ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల ఆదివారంతో మొదలై.. శనివారంతో పూర్తి అవుతుంది. ఇది క్యాలెండర్‌లో చూడ్డానికి అందంగా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

11 ఏండ్లకోసారి రిపీట్: 

Advertisement

అలాగే ఇలాంటి క్యాలెండరే 11 ఏండ్లకోసారి రిపీట్‌ అవుతూనే ఉంది. సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం అంటే  2015 సంవత్సరంలో ఇదే క్యాలెండర్‌ ఫిబ్రవరి నెల రిపీట్‌ అయింది. మళ్లీ 11 ఏండ్ల తర్వాత అంటే ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇదే నెల రిపీట్‌ అయింది. ఇంకో 11 ఏండ్ల తర్వాత అంటే 2037లో కూడా ఇదే క్యాలెండర్‌ నెల రిపీట్‌ కానుంది. ఈ మూడు సార్లు కూడా ఫిబ్రవరి నెల ఆదివారంతో మొదలై శనివారంతో పూర్తి అవుతుంది. కాబట్టి ఈ నెల మరో 800 ఏండ్ల తర్వాత వస్తుందనేది ప్రచారం మాత్రమే కానీ నిజం లేదని తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో వచ్చే ప్రతి విషయంలో నిజం ఎంత ఉందన్నది చెక్‌ చేసుకున్న తర్వాతే నమ్మాలని. లేదంటే సోషల్‌ మీడియాను గుడ్డిగా నమ్మితే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: కనిపించని మన కర్మలకు 18 మంది సాక్షులు గా ఉంటారట – ఆ 18 మంది ఎవరో తెలుసా..?

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×