E-Paper
Advertisement

Women’s jewelry: సైన్స్ నే అబ్బురపరిచే స్త్రీల ఆభరణాలు – అసలు నిజం ఏంటో తెలుసా

Women’s jewelry: సైన్స్ నే అబ్బురపరిచే స్త్రీల ఆభరణాలు – అసలు నిజం ఏంటో తెలుసా
Advertisement

Women’s jewelry: భారతీయ స్త్రీలు అనాదిగా ఎన్నో అభరనాలు ధరిస్తూ వస్తున్నారు. అయితే ఆడవాళ్లు ధరించే ప్రతి అభరణం కూడా వారికి ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయట. ఈ విషయాలు సైన్స్‌ను కూడా అబ్బురపరుస్తున్నాయట. అయితే ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్లపూసలు: స్త్రీలు నల్లపూసలు ధరించడంలో చాలా సైన్స్‌ దాగి ఉందంటున్నారు పండితులు. పండితులే కాదు సైంటిస్టులు కూడా నిర్దారించారు. నల్లపూసలు బ్లడ్‌ సర్కులేషన్‌లో చాలా బాగా ఉపయోగపడతాయట. ఇవి ఆడవాళ్లు ధరిస్తే  బీపీ రాదట.

Advertisement

గాజులు: గాజుల వల్ల ఆడవాళ్లకు మానసికమైన ప్రశాంతత లభిస్తుందట. ఎంతో ధ్యానం చేస్తే కానీ రాని ప్రశాంతత ఒక్క గాజుల ధరించడం వల్ల వస్తుందని అధునిక శాస్త్రవేత్తలు.. జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఉంగరం: స్త్రీలు చేతులకు ఉంగరాలు ధరించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. చేతికి ఉన్న ఉంగరాలు ప్రెజర్‌ పాయింట్స్‌ గా పని చేసి ధరించిన  వారికి హార్ట్‌ ప్రాబ్లమ్స్‌ రాకుండా నిరోధిస్తాయట.

Advertisement

పట్టీలు: ఆడవాళ్లు కాళ్లకు పెట్టుకునే పట్టీల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. పట్టీలు పెట్టుకోవడం వల్ల ఆడవారికి కీళ్ల నొప్పులు వచ్చే శాతం తగ్గిపోతుందట. అలాగే కాళ్ల నొప్పులు కూడా రావట.

మెట్టెలు: మెట్టెల ధారణలో కూడా చాలా సైంటిఫిక్‌ రీజన్స్‌ ఉన్నాయంటున్నారు. స్త్రీలు కాళ్లకు ధరించే మెట్టెలు ఆడవారికి వచ్చే మెన్సెన్స్‌లో సమతుల్యతను కాపాడతయట. దీంతో నెలసరి సరిగ్గా రావడంలో కీలకపాత్ర పోషిస్తాయట మెట్టెలు.

వడ్డాణం: స్త్రీలు ధరించే వడ్డానం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన చేకూరుస్తుందట. వడ్డాణం ధరించడం వల్ల స్త్రీల వెన్నుపూసకు బలం చేకూరుతుందట. వెన్నెముకకు సంబంధించిన మెజార్టీ శాతం ప్రాబ్లమ్స్‌ రాకుండా వడ్డాణం కాపాడుతుందట.

చెవి పోగులు: ఇక ఆడవాళ్లు అందం కోసం పెట్టుకునే చెవి పోగులు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయట. వాటిలో ముక్యమైనది జ్ఞాపకశక్తి అంటున్నారు పండితులు. చెవి పోగులు పెట్టుకోవడం వల్ల వారికి జ్ఞాపకశక్తి బాగా పని చేస్తుందట.

కుంకుమ: ఆడవాళ్లు సౌభాగ్యానికి ప్రతీకగా చెప్పుకుని పెట్టుకునే కుంకుమలోనూ ఎంతో ఆరోగ్య ప్రయోజనం దాగుందట.. వర్జినల్‌ కుంకుమ నుదుటన ధరించడం వల్ల తలనొప్పి రాకుండా కాపాడుతుందట.

కడియం: అడవాళ్లు చేతులకు కాళ్లకు కడియాలు ధరిస్తుంటారు. ఇప్పటి చాలా తక్కువగా ధరిస్తున్నారు కానీ ఒకప్పుడు పల్లెటూల్లలో ప్రతి ఒక్కరు వెండి కడియాలు ధరించేవారు. ఈ కడియాలు ధరించడం వల్ల స్త్రీలలో రోగనిరోధక శక్తి పెరుగుతుందట.

ముక్కెర: ముక్కుకు ముక్కెర ధరించిన స్త్రీలు ఎంతో అందంగా కనిపిస్తుంటారు. ఆడవారికి ఎంతో అందాన్ని తీసుకొచ్చే ముక్కెర ధరించడం వల్ల వారికి సైనస్‌ సమస్య రాదట. ఒకవేళ ఉన్నా పెద్దగా బాధించదట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×