E-Paper
Advertisement

Saturday: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట

Saturday: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట
Advertisement

Saturday: శనివారం రోజు పోరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా శనిదేవుడి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ శని వారం చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

గడ్డం, జుట్టు, గోర్లు కత్తిరించకూడదు:

శనివారం ఎవరైతే గోర్లు కత్తిరించడం చేస్తారో అలాంటి వారికి శనిదోషం పట్టుకుంటుందట. ఇంకా శనివారం గడ్డం గీయించుకోవడం.. జుట్టు కత్తిరించుకోవడం చేసినా శని దోషం పట్టుకుంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు.. శని దోషం పట్టుకుంటే ఆ వ్యక్తులు ఆర్థిక, సామాజిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాలసి వస్తుందట.

కూతురుని అత్తారింటికి పంపవద్దు:

Advertisement

ఎవరైనా తమ కూతురు పుట్టిన ఇంటికి వచ్చాక తిరిగి అత్త వారింటికి వెళ్లుతున్నపుడు ఎట్టి పరిస్థితుల్లో శనివారం పంపకూడదట. ఇలా పంపించడం వల్ల వారి వైవాహిక జీవితంలో అనేక కలహాలు వస్తాయట. కూతరు కాపురమే కూలిపోయే ప్రమాదం వస్తుందట. అందుకే శనివారం కూతురును ఎట్టి పరిస్థితుల్లో మెట్టినింటికి పంపకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.

నూనె, నల్ల మినుములు కొనకూడదు:

శనివారం శనిదేవుడికి ప్రీతిపాత్రమైనది అలాగే నూనె, నల్ల మినపపప్పు కూడా శనిదేవుడికి ఇష్టమైనవి కాబట్టి శనివారం ఎట్టి పరిస్థితుల్లో నూనె కానీ నల్ల మినప పప్పు కానీ కొని ఇంటికి తీసుకురాకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. అయితే కొని ఇంటికి తీసుకొస్తే అశుభం కానీ కొని దానం చేస్తే మాత్రం ఎంతో శుభఫలితం వస్తుందట.

మాంసం, మద్యం ముట్టుకోవద్దు:

Advertisement

శనివారం ఎట్టి పరిస్థితుల్లో మాంసం తినకూడదట. అలాగే మద్యం తాగకూడదట. అలా చేయడం వల్ల శనీశ్వరుడి ఆగ్రహానికి కారణం అవుతారట. కాబట్టి శనివారం మద్యం, మాంసం నిషిద్దం అంటున్నారు పండితులు.

పేదలను బీదవారిని బాధించకూడదు:

ఎవరైనా శనివారం రోజు పేదలను కానీ బీదవారిని కానీ అన్యాయంగా బాధిస్తే శనిశ్వరుడికి కోపం వస్తుందట. బాధించిన వారిని చాలా కఠినంగా శిక్షిస్తాడట. అయితే ఎప్పుడైనా పేదలను బీదలను అన్యాయంగా బాధించడం తప్పే కానీ శని వారం బాధిస్తే శనీశ్వరుడు ఊరుకోడని పండితులు చెప్తున్నారు.

ఉప్పు కొనడం నిషిద్దం:

మంద గమనుడైన శనీశ్వరుడికి ఉప్పు అంటూ కూడా మహా ప్రీతి అంట అందుకే శనివారం ఉప్పు కొనడం నిషిద్దం అంటున్నారు పండితులు. శనివారం ఉప్పు కొని ఇంటికి తీసుకురావడం ఇంట్లోకి శనిని ఆహ్వానించినట్లేనని పండితులు సూచిస్తున్నారు.

ఇనుము కొనకూడదు, ఇంటికి తీసుకురాకూడదు:

శనివారం రోజు ఇనుము కొనడం కూడా చేయకూడదట.  అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొంటే ఇంటికి మాత్రం తేకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇనుముకు అధిపతి శని కాబట్టి శనివారం రోజు ఇనుము కొని ఇంటికి తీసుకురావడం శనికి స్వాగతం చెప్పడం లాంటిదని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఊహించని అభివృద్ది

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×