E-Paper
Advertisement

wedding card: శాస్త్రం ప్రకారం పెళ్లి కార్డు ముందుగా ఎవరికి ఇవ్వాలో తెలుసా

wedding card: శాస్త్రం ప్రకారం పెళ్లి కార్డు ముందుగా ఎవరికి ఇవ్వాలో తెలుసా
Advertisement

wedding card: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి కార్డు ముందుగా ఎవరికి ఇవ్వాలో తెలుసా..? మొదటి కార్డే కాదు వరుసగా ఐదు కార్డుల వరకు ఎవరికి ఇవ్వాలో తెలుసా..? చాలా మంది పెళ్లి అబ్బాయిది అయితే అమ్మాయి వాళ్లకు.. అమ్మాయిది అయితే అబ్బాయి వాళ్లకు కార్డు ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇలా ఒకరికొకరు కార్డు ఇచ్చిపుచ్చుకునేది ముందు ఐదు మందికి ఇచ్చాకే చేయాలట. అయితే మొదటి కార్డు నుంచి ఐదవ కార్డు వరకు ఎవరెవరికి ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మొదటి కార్డు:

పెళ్లి చేసుకునేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా  తమ పెళ్లి మొదట్టి కార్డును విఘ్నాలను తొలగించే గణేశుడికి ఇవ్వాలట. ఇలా ఎందుకు ఇవ్వాలంటే. వివాహంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోమని ఆ గణపతిని మొక్కుకుని ఆయనకే మొదటి శుభలేఖను ఇవ్వాలని శాస్త్రం చెప్తుందంటున్నారు పండితులు.

రెండవ కార్డు:

Advertisement

మొదటి కార్డు పెళ్లిలో అడ్డంకులు జరగకుండా చూడాలని గణేశుడిని వేడుకుని ఆయనకు ఇస్తే… రెండవ కార్డు మాత్రం విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలకు ఇవ్వాలట. ఎందుకంటే లక్ష్మీ నారాయణలు లేనిదే ఈ లోకంలో ఎవరి పెళ్లి జరగదు.. పెళ్లి మాత్రమే కాదు.. ఏ ఇంట్లో జరిగే శుభకార్యానికైనా ఆ లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటారట.

మూడవ కార్డు:

ఒకటి రెండు కార్డులు గణపతికి, లక్ష్మీ నారాయణులకు ఇస్తే.. మూడవ కార్డు హనుమంతుడికి ఇవ్వాలట. హనుమంతుడికి ఇవ్వాలనడంలో అంతర్యం ఏమిటంటే.. ఆ ఇంట్లో జరిగే వివాహం మీద ఎలాంటి చెడు శక్తుల ప్రభావ లేకుండా చూడమని హనుమంతుడిని కోరుకుంటూ మూడవ కార్డు ఆంజనేయస్వామికి ఇవ్వాలట.

నాలుగవ కార్డు:

Advertisement

మొదటి మూడు కార్డులు, గణపతికి, లక్ష్మీనారాయణులకు, హనుమంతుడికి ఇస్తే నాలుగవ కార్డు కులదేవతల గుడికి వెళ్లి అక్కడ వారికి శుభలేఖ ఇచ్చి పెళ్లిలో అంతా మంచే జరిగేలా చూడమని.. కుటుంబానికి రక్షణగా ఉండమని వేడుకుని రావాలని పండితులు సూచిస్తున్నారు.

ఐదవ కార్డు:

మొదటి నాలుగు శుభలేఖలు ఇవ్వడం అయిపోయాక ఐదవ కార్డును మాత్రం పితృదేవతలకు ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. అయితే పితృదేవతలకు ఎక్కడ ఇవ్వాలని చాలా మందికి డౌటు వస్తుంది. ఇంట్లో పితృదేవతలకు పూజించే ఆచారం ఉంటుంది కదా.. చాలా మంది పెళ్లికి ముందు పితృదేవతలను ఇంట్లో పూజిస్తుంటారు.. అ సమయంలో కార్డు కూడా వారి ముందు పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవచ్చని చెప్తున్నారు.

మొదటి ఐదు కార్డులు గణపతి, లక్ష్మీనారాయణులు, హనుమంతుడు, కులదేవతులు. పితృదేవతలకు ఇచ్చిన తర్వాత ఆరవ కార్డును అమ్మాయి పెళ్లి వారయితే అబ్బాయి వాళ్లకు అబ్బాయి పెళ్లి వాళ్లయితే అమ్మాయి పెళ్లి వాళ్లకు ఇచ్చిపుచ్చుకోవాలని సూచిస్తున్నారు పండితులు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కాలికి నల్లదారం కడుతున్నారా..? ఈ తప్పు అసలు చేయకండి

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×