E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 మిథునరాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 మిథునరాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 మిథునరాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మిథున రాశి వారికి ఈ సంవత్సరం గౌరవం, పేరు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి.  కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. విద్యార్థులకు అనూకుల ఫలితాలుంటాయి. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం.  కుజ రాహు గ్రహ దానాలు జపం చెయ్యడం వలన శుభ ఫలితాలుంటాయి. ఈ రాశి వారికి  ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7

జనవరి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి స్త్రీ మూలకంగా గొడవలు ఉంటాయి. అనవసరపు గొడవలు, సంతానానికి చేడు. సుఖ శాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. బంధు వర్గం నుండి ద్వేషం ఉంటుంది. 

ఫిబ్రవరి :

ఈ నెలలో ఈ రాశి వారికి రుణ భారం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తప్పవు. ఖర్చులు ఎక్కు కావడం, అధికారులతో గొడవలు పడడం, బంధు మిత్రులకు దూరం, శస్త్ర చికిత్సకు గురికావచ్చు. 

మార్చి:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి ధన నష్టం, విపరీతమైన ఖర్చులు ఉంటాయి.   తండ్రికి అంత మంచి సమయం కాదు. కొన్ని శుభకార్యాలు జరగడం, భోజన ప్రాప్తి ఉంటుంది. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారి తండ్రికి అంత సమయం కాదు. కొన్ని శుభకార్యక్రమాలు జరుగుతాయి. విపరీతమైన ఖర్చులుంటాయి. ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఉంటాయి. అత్యధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి  అధికారులతో గొడవలు వల్ల  మనశ్శాంతి ఉండదు.  ఉన్నత పదవులను, సంఘంలో గౌరవాన్ని పొందుతారు. సంప్రదాయాల పట్ల గౌరవ ఉంటుంది. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి ప్రభుత్వం నుండి ఇబ్బందులుంటాయి. కష్ట నష్టాలు దూరసంచారములు. ధన వ్యయం. సమయానికి తిండి తినకపోవుట నరాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. కోపం అనవసరంగా గొడవలు.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారికి  వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. వస్తువులను పోగొట్టుకోవడం. కళత్రంలో గొడవలు ఉండవచ్చు. సోదరులకు మంచిది. ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి. అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారికి  భూ, భవనాల వలన లాభం, సోదరులకు మంచిది. పోటీలలో విజయం లభిస్తుంది. క్రయావిక్రయం సంబంధించి ప్రయోజనకరమైన ఫలితాలుంటాయి. శారీరక రుగ్మతతో పాటు ఇతరుల వలన భాదలు ఉంటాయి.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి  ఖర్చులు అధికంగా ఉంటాయి. వేళకు సరియైన తిండి ఉండదు. శారీరక శ్రమ, మానసిక ఆందోళనలు నలత ఏర్పడుతుంది. ప్రభుత్వం నుండి ఇబ్బందులుంటాయి. భార్య నుంచి సహాయ సహకారాలు అందివస్తాయి.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ స్థిరచిత్తత ఉండదు. సంతానానికి, తల్లి దండ్రులకు గడ్డురోజులు, చిన్న చిన్న విషయములకు కూడా కోపపడవలసి వస్తుంది.  అత్యధిక శ్రమతో అత్యల్ప ఫలితం లభిస్తుంది.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి బాధలన్నీ తొలగిపోయి. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభ కార్యాలు జరుగుతాయి. సంతానానికి, మేలైన కాలం. ఊహించని రీతిలో ఖర్చులుంటాయి. తండ్రికి అంత మంచిది కాదు. ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి  ధనాదాయం బాగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఎక్కువ గొడవలు ఉంటాయి. జీర్ణకోశ సమస్యలు విభిన్న మార్గాలలో బాధలు ఉంటాయి. చివరలో శుభ ఫలితాలు ఉంటాయి.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×